Varaharoopam : ‘కాంతార’కి ఊరటనిచ్చిన కోర్టు.. వరాహరూపం ఈజ్ బ్యాక్..

కొన్ని రోజుల క్రితం వరాహరూపం పాటకి వాడిన మ్యూజిక్ మాది అంటూ ఓ మలయాళ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ కోర్టులో కేసు వేయడంతో ఆ మ్యూజిక్ ని వాడొద్దంటూ కోర్టు అప్పటికి నిషేధం విధించి విచారణని వాయిదా వేసింది. దీంతో ఆ మ్యూజిక్ తీసేసి................

Varaharoopam : ‘కాంతార’కి ఊరటనిచ్చిన కోర్టు.. వరాహరూపం ఈజ్ బ్యాక్..

Varaharoopam :  రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన కన్నడ సినిమా కాంతార దేశమంతటా మంచి విజయం సాధించి భారీ కలెక్షన్స్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల నవంబర్ 24 నుంచి కాంతార సినిమా ఓటీటీలోకి వచ్చింది. అయితే సినిమా క్లైమాక్స్ లో వచ్చే వరాహరూపం మ్యూజిక్ ని ఓటీటీలో తీసేసి రిలీజ్ చేశారు. దీనిపై ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి చెందారు.

కొన్ని రోజుల క్రితం వరాహరూపం పాటకి వాడిన మ్యూజిక్ మాది అంటూ ఓ మలయాళ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ కోర్టులో కేసు వేయడంతో ఆ మ్యూజిక్ ని వాడొద్దంటూ కోర్టు అప్పటికి నిషేధం విధించి విచారణని వాయిదా వేసింది. దీంతో ఆ మ్యూజిక్ తీసేసి సినిమాని రిలీజ్ చేశారు. సినిమాకి వరాహరూపం మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. అలాంటిది ఆ మ్యూజిక్ తీసేయడంతో అందరూ వరాహరూపం మ్యూజిక్ కావాలంటూ సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ చేశారు.

BiggBoss 6 Day 82 : బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా..?

ఈ కేసు విచారణకి రాగా కోర్టు ఈ సారి వరాహరూపం మ్యూజిక్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కాంతార సినిమాకి సపోర్ట్ గా తీర్పునిచ్చింది. దీంతో ఆ మ్యూజిక్ పై నిషేధం ఎత్తివేయడంతో త్వరలో ఆ మ్యూజిక్ తో ఓటీటీలో రానుంది కాంతార. దీనిపై సినిమా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.