Congress Twitter: కేజీఎఫ్-2 సాంగ్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశం.. కాంగ్రెస్ పార్టీ ఏమందంటే?

కోర్టు తీర్పుపై కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది.. కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర యొక్క ట్విట్టర్ హ్యాండిల్‌పై బెంగళూరు కోర్టు ఆదేశించిన విషయం మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మేము కోర్టు కార్యకలాపాలకు హాజరుకాలేదు. ఆర్డర్ కాపీ కూడా అందలేదు. మేము మా వద్ద ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను అనుసరిస్తున్నామని తెలిపింది.

Congress Twitter: కేజీఎఫ్-2 సాంగ్ ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశం.. కాంగ్రెస్ పార్టీ ఏమందంటే?

Bharat jodo Yatra

Congress Twitter: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. భారత్ జోడో యాత్రలో భాగంగా కేజీఎఫ్-2 సినిమాకు సంబంధించిన పాటను కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో రాహుల్ గాంధీ వీడియోలో వినియోగించింది. ఎలాంటి అనుమతులు లేకుండా సినిమా పాటను వాడుకున్నందుకు కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ హిందీలో కేజీఎఫ్-2 మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ఎంఆర్‌టీ మ్యూజిక్ సంస్థ బెంగళూరు కోర్టులో ఫిర్యాదు చేసింది.

Bharat jodo yatra: తెలంగాణను విడిచి మహారాష్ట్రకు వెళ్తున్నాను.. బాధగా ఉంది: రాహుల్ గాంధీ

ఎంఆర్‌టీ సంస్థ నిర్వాహకులు ఎం. నవీన్ కుమార్.. కర్ణాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించారని, కేజీఎఫ్-2 నుండి పాటను ఎలాంటి అనుమతి లేకుండా వాడుకున్నారంటూ రాహుల్ గాంధీ సహా జైరాం రమేష్, సుప్రీయా శ్రీనాతేలపై యశ్వంత్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హిందీ కేజీఎఫ్-2 పాటల హక్కులను దక్కించుకునేందుకు చాలా డబ్బులు చెల్లించినట్లు సంగీత సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది.

కాంగ్రెస్‌ పార్టీపై కాపీరైట్ కేసు దాఖలు చేసిన నేపథ్యంలో బెంగళూరు కోర్టు సోమవారం విచారణ జరిపి తీర్పునిచ్చింది. సినిమా పాట ఒరిజినల్ వెర్షన్‌లో కొన్ని మార్పులుచేసి ఉపయోగించినట్లు పిటిషనర్ తరఫున సీడీ ద్వారా రుజువైంది. ఈ రకమైన మార్కెటింగ్ వీడియోలు పైరసీని ప్రోత్సహిస్తాయి. రెండు ఖాతాల్లో నుండి మూడు లింక్‌లను తొలగించాలని ట్విట్టర్‌ని కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్, భారత్ జోడో యాత్రల ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించింది. అయితే కోర్టు తీర్పుపై కాంగ్రెస్ ప్రకటన విడుదల చేసింది.. కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర యొక్క ట్విట్టర్ హ్యాండిల్‌పై బెంగళూరు కోర్టు ఆదేశించిన విషయం మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మేము కోర్టు కార్యకలాపాలకు హాజరుకాలేదు. ఆర్డర్ కాపీ కూడా అందలేదు. మేము మా వద్ద ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను అనుసరిస్తున్నామని తెలిపింది.