dk shivkumar: డీకే శివ కుమార్‌కు మ‌నీలాండ‌రింగ్ కేసులో స‌మ‌న్లు

తాను బీజేపీలో చేరకపోవడం వల్లే ప్రభుత్వ సంస్థలు త‌న‌పై కేసులు నమోదు చేస్తున్నాయని డీకే శివ‌కుమార్ విమర్శించారు. వ‌చ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గాల్సి ఉన్న నేప‌థ్యంలో తనపై అన్ని రాజకీయ ఆయుధాలను వాడారని ఆయన అన్నారు.

dk shivkumar: డీకే శివ కుమార్‌కు మ‌నీలాండ‌రింగ్ కేసులో స‌మ‌న్లు

Shivkumar

dk shivkumar: క‌ర్ణాట‌క కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డీకే శివ కుమార్‌కు ఢిల్లీలోని ఓ ప్ర‌త్యేక కోర్టు స‌మ‌న్లు పంపింది. న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో జూలై 1న విచార‌ణ‌కు కోర్టుకు హాజ‌రుకావాల‌ని న్యాయ‌మూర్తి వికాస్ ఆదేశించారు. శివ కుమార్‌తో పాటు మ‌రి కొంద‌రికి కూడా నోటీసులు అందాయి. శివ కుమార్‌పై 2018లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసు న‌మోదైంది.

Naqvi: లోక్‌స‌భ స‌భ్యుడిగా కేంద్ర‌మంత్రి న‌ఖ్వీ పోటీ?

దీనిపై న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ నిరోధ‌క చట్టం (పీఎంఎల్ఏ) కింద మే 26న‌ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు ఛార్జిషీటు దాఖ‌లు చేయ‌గా దానిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్లు న్యాయ‌స్థానం తెలిపింది. కాగా, తనకు కోర్టు సమన్లు పండడంపై డీకే శివ కుమార్ స్పందించారు. ”నేను బీజేపీలో చేరకపోవడం వల్లే ప్రభుత్వ సంస్థలు నాపై కేసులు నమోదు చేస్తున్నాయి” అని విమర్శించారు.

Naqvi: లోక్‌స‌భ స‌భ్యుడిగా కేంద్ర‌మంత్రి న‌ఖ్వీ పోటీ?

వ‌చ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గాల్సి ఉన్న నేప‌థ్యంలో తనపై అన్ని రాజకీయ ఆయుధాలను వాడారని ఆయన అన్నారు. రాజ‌కీయ ప‌రంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండ‌కూడ‌ద‌నే ప్ర‌భుత్వం ఇటువంటి చర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. కాగా, శివ కుమార్‌ను ప‌లు సార్లు విచారించిన అనంత‌రం 2019లో ఈడీ అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న బెయిలుపై ఉన్నారు.