Covaxin: కొత్త వేరియెంట్లపై సమర్ధంగా పనిచేస్తున్న కొవాగ్జిన్

యాంటీబాడీ రెస్పాన్స్, వైరల్ లోడ్, క్లినికల్ అబ్జర్వేషన్స్, ఊపిరితిత్తులపై ప్రభావం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయన నివేదిక రూపొందించారు. రెండో డోసు, మూడో డోసు తీసుకున్న వాళ్లలో వైరల్ లోడ్ చాలా వరకు తగ్గింది.

Covaxin: కొత్త వేరియెంట్లపై సమర్ధంగా పనిచేస్తున్న కొవాగ్జిన్

Covaxin

Covaxin: కరోనా కొత్త వేరియెంట్లపై కొవాగ్జిన్ బూస్టర్ డోస్ సమర్ధంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనం తెలిపింది. డెల్టా వేరియెంట్‌తోపాటు, ఒమిక్రాన్ బి.ఎ.1.1, బి.ఎ.2 వేరియెంట్లను కొవాగ్జిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ఈ అధ్యయనం తెలిపింది. ‘ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్)’కు చెందిన ‘ద నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ విభాగం ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అనే సంస్థ, ఐసీఎమ్ఆర్ కలిసి సంయుక్తంగా కొవాగ్జిన్ రూపొందించాయి. ఈ అధ్యయనం ప్రకారం మొదటి, రెండు డోసుల కన్నా కొవాగ్జిన్ బూస్టర్ డోసు కొత్త వేరియెంట్లను అదుపు చేయడంలో మరింత సమర్ధంగా పనిచేస్తోంది.

5G spectrum: 5జీ వేలానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

యాంటీబాడీ రెస్పాన్స్, వైరల్ లోడ్, క్లినికల్ అబ్జర్వేషన్స్, ఊపిరితిత్తులపై ప్రభావం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయన నివేదిక రూపొందించారు. రెండో డోసు, మూడో డోసు తీసుకున్న వాళ్లలో వైరల్ లోడ్ చాలా వరకు తగ్గింది. ఊపిరితిత్తుల సమస్య కూడా తగ్గింది. కోవిడ్ వైరస్ పెరుగుదల చాలా వరకు ఆగియింది. డెల్టా, ఒమిక్రాన్ వేరియెంట్లను నియంత్రించడంతోపాటు, ఇతర కోవిడ్ సంబంధిత సమస్యలు రాకుండా కూడా కొవాగ్జిన బూస్టర్ డోసు పనిచేస్తున్నట్లు తాజా నివేదిక తెలిపింది. దేశంలో మొట్టమొదటగా కోవిడ్‌కు వ్యతిరేకంగా అందుబాటులోకి వచ్చింది కొవాగ్జిన్ వ్యాక్సిన్ అనే సంగతి తెలిసిందే.