కరోనా టీకాపై భారత్ బయోటెక్ తీపికబురు

కరోనా టీకాపై భారత్ బయోటెక్ తీపికబురు

Bharat Biotech:దేశ ప్రజలకు భారత్‌ బయోటెక్‌ తీపి కబురు అందించింది. తాము తయారు చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా సామర్థ్యం 81శాతం సాధించినట్టు వెల్లడించింది సదరు సంస్థ. దాదాపు 25వేలకుపైగా వాలంటర్లపై జరిపిన క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ విషయం తేలినట్లుగా సంస్థ వెల్లడించింది. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు వెల్లడించిన భారత్‌ బయోటెక్‌.. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఈమేరకు విజయం సాధించినట్లు స్పష్టం చేసింది.

కొవాగ్జిన్‌ టీకా 81శాతం సమర్థత సాధించగా.. టీకా కోవాగ్జిన్‌ వైరస్‌ను నియంత్రించడంలో మంచి ఫలితాలను చూపిస్తున్నట్లుగా వెల్లడించింది. అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌.. మధ్యంతర క్లినికల్‌ సామర్థ్యం 81శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. భారత్‌ బయోటెక్‌ దాదాపు 25వేల 800 మంది వాలంటర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. వీరిలో 81శాతం వ్యాక్సిన్‌ పనితీరు కనబర్చింది. గతంతో పోలిస్తే ఫలితాలు బాగా మెరుగయ్యాయి.

భారత్‌లో ఇంత పెద్ద సంఖ్యలో ప్రయోగాలు చేయడం భారత్‌ బయోటెక్‌కు మాత్రమే సాధ్యమైంది. దేశంలో అత్యవసర వినియోగం కింద ఇప్పటికే కొవాగ్జిన్‌ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే మరింత సమాచారంతోపాటు కొవాగ్జిన్‌ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు టీకాపై క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతాయని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్‌ బయోటెక్‌ మరో కీలక దశను చేరుకున్నట్టు భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల తెలిపారు. దేశంలోనే అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టామన్నారు. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు.