Covid-19 cases: దేశంలో కొత్తగా 492 కరోనా కేసులు నమోదు

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 500కు దిగువన చేరుకుంది. తాజాగా, 492 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,46,69,015కు చేరిందని వివరించింది. ప్రస్తుతం కరోనా ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 6,489గా ఉన్నట్లు పేర్కొంది.

Covid-19 cases: దేశంలో కొత్తగా 492 కరోనా కేసులు నమోదు

COVID 19

Covid-19 cases: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 500కు దిగువన చేరుకుంది. తాజాగా, 492 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,46,69,015కు చేరిందని వివరించింది. ప్రస్తుతం కరోనా ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 6,489గా ఉన్నట్లు పేర్కొంది.

కరోనా వల్ల నిన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారని, వారిలో ముగ్గురు కేరళకు చెందినవారని, మరొకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాల సంఖ్య 5,30,574గా ఉందని చెప్పింది. కరోనా నుంచి ఇప్పటివరకు 4,41,31,952 మంది కోలుకున్నారని పేర్కొంది.

కరోనా రికవరీ రేటు 98.79 శాతంగా ఉన్నట్లు తెలిపింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 219.86 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. నిన్న 79,155 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వివరించింది. నిన్న దేశంలో 1,92,665 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..