Mumbai Covid-19 : 13 మంది DCPలతో సహా 132 మంది పోలీసులకు కరోనా..ఇద్దరు మృతి

ముంబైలో కరోనా కొత్త వేరియంట్‌కు విజృంభిస్తోంది. ముంబైలో ఒకేరోజు 114 మంది పోలీసులు, 18 మంది సీనియర్‌ పోలీసు అధికారులు కోవిడ్ బారిన పడ్డారు.

Mumbai Covid-19 : 13 మంది DCPలతో సహా 132 మంది పోలీసులకు కరోనా..ఇద్దరు మృతి

114 Cops And 18 Seniors Mumbai Police Officers

114 cops and 18 seniors mumbai police officers : సెకండ్ వేవ్ లో దేశంలోనే ఎక్కువ కోవిడ్ కేసులు నమోదు అయిన మహారాష్ట్రలో మరోసారి మహమ్మారి మరోసారి కల్లోకలం కలిగిస్తోంది. ముఖ్యంగా ముంబైలో కోవిడ్ ప్రతాపం చూపుతోంది.ఈ క్రమంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉన్న పోలీసులు కోవిడ్ బారినపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో సహా ముంబైలో 132మంది పోలీసులు కరోనా బారినపడ్డారు.

Read more : Delhi Covid Cases : ఢిల్లీలో కోవిడ్ పరిస్ధితిపై నేడు సమీక్ష

దేశ ఆర్థిక రాజధానిలో ముంబైలో కరోనా కొత్త వేరియంట్‌కు విజృంభిస్తోంది. ముంబైలో పోలీసులు భారీసంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఆదివారం (జనవరి 9,2022)ఒకేరోజు 114 మంది పోలీసులు, 18 మంది సీనియర్‌ పోలీసు అధికారులకు వైరస్‌ సోకిందని ముంబై పోలీస్‌ శాఖ వెల్లడించింది.

వీరిలో 13 మంది డిప్యూటీ కమిషనర్లు (DCP), నలుగురు అడిషనల్‌ సీపీలు, ఓ జాయింట్‌ సీపీ ఉన్నారని తెలిపింది. మరో విషాదం ఏమిటంటే 48 గంటల్లో ఇద్దరు సిబ్బంది కోవిడ్ బారిన పడి మరణించారని తెలిపింది. దీంతో కరోనా వైరస్‌ వల్ల చనిపోయిన ముంబై పోలీసుల సంఖ్య 125కి చేరింది.

Read more : India Covid-19 Cases : దేశంలో కొత్తగా లక్షా 79 వేల కోవిడ్ కేసులు

బ్రిహిన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో (BMC) నిన్న 19,474 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు మృతిచెందారు. నగరంలో ప్రస్తుతం 1,17,437 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని బీఎంసీ తెలిపింది.