COVID 19: దేశంలో 1,45,654 క‌రోనా యాక్టివ్ కేసులు

దేశంలో కొత్త‌గా 20,557 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంట‌ల్లో 18,517 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని పేర్కొంది. క‌రోనా వల్ల మ‌రో 40 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్ వ‌ల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,25,825కి చేరింద‌ని తెలిపింది.

COVID 19: దేశంలో 1,45,654 క‌రోనా యాక్టివ్ కేసులు

COVID-19

COVID 19:  దేశంలో కొత్త‌గా 20,557 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంట‌ల్లో 18,517 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని పేర్కొంది. క‌రోనా వల్ల మ‌రో 40 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్ వ‌ల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,25,825కి చేరింద‌ని తెలిపింది. దేశంలో హోం క్వారంటైన్లు, ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య‌ 1,45,654కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

నిన్న‌టికంటే యాక్టివ్ కేసుల సంఖ్య 2,000 పెరిగింద‌ని తెలిపింది. దేశంలో క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,32,140కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతంగా ఉంద‌ని చెప్పింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ప్ర‌భుత్వ కేంద్రాల్లో బూస్ట‌ర్ డోసును ఉచితంగా ఇస్తున్నారు. నిన్న దేశంలో 26,04,797 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివ‌రించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు వేసిన క‌రోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200,61,24,684కి చేరింద‌ని తెలిపింది.

COVID-19 vaccine: ప్ర‌ధాని మోదీకి అభినంద‌న‌లు: బిల్ గేట్స్‌