ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ రావడం కష్టమే

  • Published By: madhu ,Published On : July 5, 2020 / 10:14 AM IST
ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ రావడం కష్టమే

కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది ? దీని నుంచి ఎప్పుడు బయటపడుతాం ? ఇలాంటి ఎనో ప్రశ్నలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. కానీ..తొందరలోనే వ్యాక్సిన్ వచ్చేస్తుందని భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అందుకనుగుణంగా ప్రయోగాలు జరుపుతున్నారు.

ఆగస్టు 15వ తేదీ లోపు కరోనాకు మందు ఆవిష్కరిస్తామని CSIR ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే..దీనిపై CSIR – CCMB సంచాలకులు రాకేష్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం కోవిడ్ – 19 వ్యాక్సిన్ రావడం కష్టమేనని తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది తొలినాళ్లలో అందుబాటులోకి రావొచ్చని వెల్లడిస్తున్నారు. ఇందుకు భారీ స్థాయిలో క్లినిక్ ట్రయల్స్ చేపట్టాల్సి ఉందని తెలిపారు.

ఎవరికన్నా…అనారోగ్యం ఉందని తెలిస్తే..ఏదైనా మందు ఇచ్చి తగ్గిందా ? లేదా ? అని చూసేందుకు ఇదేమి డ్రగ్ కాదని స్పష్టం చేశారు. వ్సాక్సిన్ తయారు కావాలంటే..కొన్ని సంవత్సరాలు పడుతుందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం కరోనాకు వ్యాక్సిన్ ఇప్పుడు రాదని మరోసారి తేల్చిచెప్పారు. ప్రస్తుతం రోజుకు 400 – 500 కరోనా టెస్టులు చేయడం జరుగుతోందని, ఎక్కువ టెస్టులు చేసుకొనేందుకు అనుమతినివ్వాలని

ICMR కు ప్రతిపాదించామని, అనుమతి కోసం ఎదురు చూస్తున్నామన్నారు.
ఆగష్టు 15 నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ICMR చేసిన ప్రకటనపై వైద్య, పరిశోధన నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే…అంతర్జాతీయ నిబంధనల మేరకే వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నట్లు సదరు సంసథ ప్రకటించింది.