COVID-19: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. వరుసగా రెండోరోజు 1800 కొత్త కేసులు.. 10వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

రోజురోజుకు దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుదల కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి ఏప్రిల్ 9, 10 తేదీల్లో ‘కోవిడ్ మాక్ డ్రిల్’పై అధికారులకు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్రం సూచనలు చేసే అవకాశం ఉంది.

COVID-19: భారతదేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నెల రోజులుగా కరోనా కొత్త కేసుల గణాంకాలను చూస్తే కరోనా వ్యాప్తి పెరుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఆదివారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 1,890 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1805 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య పదివేల మార్క్ దాటింది.

COVID-19: భారీగా పెరిగిన కోవిడ్ కేసులు.. ఒకే రోజు 1,890 కేసులు నమోదు.. ఐదు నెలల తర్వాత ఇదే అధికం

రోజురోజుకు దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుదల కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి ఏప్రిల్ 9, 10 తేదీల్లో ‘కోవిడ్ మాక్ డ్రిల్’పై అధికారులకు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్రం సూచనలు చేసే అవకాశం ఉంది. తాజా గణాంకాల ప్రకారం.. గడిచిన 134 రోజుల తరువాత దేశంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 10వేల మార్కుకు చేరింది. రోజువారి పాజిటివిటీ రేటు 3.19 శాతం, వారంవారీ సానుకూలత రేటు 1.39శాతంగా నమోదైంది.

Covid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్.. దేశంలో 1500 దాటిన కేసులు.. ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి

దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా మరణాల సంఖ్యకూడా పెరుగుతోంది. సోమవారం గణాంకాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో కొవిడ్ కారణంగా ఆరుగురు మరణించారు. దీంతో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,30,837కి పెరిగింది. ఛండీగడ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గడిచిన 24గంటల్లో ఒక్కొక్క మరణాలు నమోదుకాగా, కేరళ రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఈ డ్రైవ్ కింద ఇప్పటి వరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు