Covid Center: కరోనా రోగులతో కలిసి డాక్టర్ల డాన్స్.. వీడియో వైరల్!

కరోనా రోగులకు చికిత్స అందించే ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక్కడ పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి సేవ చేస్తుంటారు.

Covid Center: కరోనా రోగులతో కలిసి డాక్టర్ల డాన్స్.. వీడియో వైరల్!

Covid Center

Covid Center: కరోనా రోగులకు చికిత్స అందించే ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక్కడ పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి సేవ చేస్తుంటారు. కరోనా మహమ్మారి వైద్యులు, వైద్య సిబ్బందిని సైతం వదలక మింగేస్తున్నా వారు మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేస్తున్నారు. వారిలో కొందరు మానసికంగా కృంగిపోయిన రోగులలో ధైర్యం నింపి.. వారిని కోలుకునేలా చేయడం కూడా ఇప్పటికే మనం అప్పుడప్పుడు చూసేశాం.

కాగా.. ఇప్పుడు ఏకంగా ఓ కోవిడ్ కేర్ సెంటర్లో వైద్యులు, సిబ్బంది రోగులతో కలిసి చిందేశారు. మ‌హారాష్ట్ర‌లోని గోరేగావ్‌లో ఉన్న కోవిడ్ సెంట‌ర్‌లో డాక్ట‌ర్లు, హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు పేషేంట్లతో కలిసి చిందేశారు. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు త‌క్కువ న‌మోదు అయిన సంద‌ర్భంగా వారంతా ఈ డ్యాన్సులు చేశారు. మ‌రాఠీ పాట‌కు వంద‌ల సంఖ్య‌లో వ‌ర్క‌ర్లు స్టెప్పులేశారు. పీపీఈ కిట్స్‌లో ఉన్న డాక్ట‌ర్లు, హెల్త్‌కేర్ వర్క‌ర్లు డ్యాన్స్ చేసిన వీడియో వైర‌ల్ అయ్యింది.

గోరేగావ్‌లో ఉన్న నెస్కో కోవిడ్ సెంట‌ర్‌లో ఈ సెలబ్రేషన్ డాన్స్ చేసినట్లు తెలుస్తుండగా.. సూప‌ర్ హిట్ మ‌రాఠీ సినిమా సైర‌త్ లోని జింగాత్ పాట‌కు డ్యాన్స్ చేశారు. నెస్కో కోవిడ్ సెంట‌ర్‌ ఏర్పాటుచేసి ఏడాది ముగిసిన సందర్భంగా జూన్ రెండ‌వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలోనే ఈ డాన్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వీడియోను పోస్టు చేసిన గంట‌ల్లోనే ల‌క్ష‌ల లైక్‌లు, వేల సంఖ్య‌లో రీట్వీట్లు రాగా నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.