Covid Vaccine: జాగ్రత్త మరిచిపోతున్నారు.. మూడో డోస్ తప్పదు మరి

వైరస్‌ను అడ్డుకోవడానికి ముందుజాగ్రత్తగా డోస్ తప్పనిసరి అంటున్నారు డా. వీకే పాల్. కొవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడైన ఆయన వ్యాక్సినేషన్ 200కోట్ల డోసులు దాటిన సందర్భంగా మాట్లాడారు. పలు దేశాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంని ఆరు నెలల తర్వాత ప్రొటెక్షన్ కోసం మరో డోస్ వేసుకోవాలని సూచించారు.

Covid Vaccine: జాగ్రత్త మరిచిపోతున్నారు.. మూడో డోస్ తప్పదు మరి

Covid 19 Vaccine

 

 

Covid Vaccine: వైరస్‌ను అడ్డుకోవడానికి ముందుజాగ్రత్తగా డోస్ తప్పనిసరి అంటున్నారు డా. వీకే పాల్. కొవిడ్-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడైన ఆయన వ్యాక్సినేషన్ 200కోట్ల డోసులు దాటిన సందర్భంగా మాట్లాడారు. పలు దేశాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుంని ఆరు నెలల తర్వాత ప్రొటెక్షన్ కోసం మరో డోస్ వేసుకోవాలని సూచించారు.

‘ప్రజల మనస్సులో మహమ్మారి బలహీనపడింది. కానీ, మనం పూర్తిగా ప్రొటెక్టెడ్‌గా ఉన్నామా అనేది చూసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ఆగష్టు – సెప్టెంబర్ నాటికి ఎన్ని డోసులు ఎక్స్‌పైర్ అయిపోతాయనే దానిపై స్పందనకు నిరాకరించిన ఆయన.. “ద డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) మిక్సింగ్ డోసులపై పిలుపునివ్వనుంది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎలా నిర్వహిస్తుందో చూడాలి” అని బదులిచ్చారు.

Read Also: కొవిడ్ బూస్టర్ డోస్ 75రోజుల పాటు ఉచితం

mRna వ్యాక్సిన్ డెంగ్యూ, ఫ్లూ జ్వరాలకు గేమ్ ఛేంజర్ గా పనిచేస్తుంది. ఒక్కసారి వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే ఇతర జబ్బులకు కూడా పని చేస్తుంది. ఇవేకాకుండా ఇన్‌ట్రా నాజల్ మూడో ట్రయల్స్ లో ఉండగా అది మరో అద్భుతం సృష్టిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.