Covid Vaccine Certificate : కేంద్రం కీలక నిర్ణయం..వారికి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు

 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డిజిటల్‌ సర్టిఫికెట్ల జారీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Covid Vaccine Certificate : కేంద్రం కీలక నిర్ణయం..వారికి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు

Va

Covid Vaccine Certificate కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డిజిటల్‌ సర్టిఫికెట్ల జారీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ల(కోవిషీల్డ్,కోవాగ్జిన్) క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న 11,349 మందికి కొ-విన్‌ పోర్టల్‌ నుంచి వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు పొందవచ్చని కేంద్రం తెలిపింది.

వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నవారికి డిజిటల్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ విజ్ఞప్తులు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు 11,349మంది డేటాను ఐసీఎంఆర్‌ అందజేసిందని తెలిపింది.

ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్ల పరిశోధన, చికిత్సలో వారి నిబద్ధత, అద్భుతమైన సహకారానికి దేశం కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. కొ-విన్‌ పోర్టల్‌తో పాటు ఆరోగ్య సేతు, డిజిలాకర్‌, ఉమాంగ్‌ యాప్‌ల ద్వారా కూడా సర్టిఫికెట్లను పొందవచ్చని ట్వీట్ లో తెలిపారు.