Covid-19: తగ్గుతున్న కరోనా.. 15 వేల దిగువకు చేరిన కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే దాదాపు రెండు వేల కరోనా కేసులు తగ్గడం గమనార్హం. శనివారంతో పోలిస్తే ఆదివారం కొంత తగ్గుదల కనిపిస్తే, సోమవారం మరిన్ని కేసులు తగ్గాయి.

Covid-19: తగ్గుతున్న కరోనా.. 15 వేల దిగువకు చేరిన కేసులు

Covid 19

Covid-19: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారంతో పోలిస్తే, సోమవారం దాదాపు రెండు వేల కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,830 కొత్త కేసులు నమోదయ్యాయి. 36 మంది మరణించారు. అంతకుముందు రోజు 16,866 కేసులు నమోదుకాగా, 41 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,47,512కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.34. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 43,920,451. కరోనాతో మరణించిన సంఖ్య 5,26,110.

Clash In Pub: పబ్బులో యువకుడిపై అమ్మాయిల దాడి.. వీడియో వైరల్

ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,32,46,829. దేశంలో పాజిటివిటీ రేటు 3.48 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 4.53 శాతం కాగా, కోవిడ్ రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 202.5 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 30,42,476 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం బూస్టర్ డోసు కూడా ఉచితంగా అందిస్తోంది. దేశంలో ఇప్పటివరకు దాదాపు 87 కోట్లకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.