Coviself: ఇంట్లోనే కరోనా టెస్ట్.. జూన్ 1న మార్కెట్లోకి మైలాబ్ టెస్ట్ కిట్!

కరోనాను కట్టడి చేయాలంటే మనముందున్న తొలిమార్గం కరోనా నిర్ధారణ పరీక్షలు. పరీక్షలు ఎంత ఎక్కువ చేస్తే మహమ్మారి వ్యాప్తికి అంత తక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యాధి నిర్ధారణ జరిగితే ఆ వ్యక్తి సమాజంలో తిరిగే అవకాశం తక్కువ ఉంటుంది.

Coviself: ఇంట్లోనే కరోనా టెస్ట్.. జూన్ 1న మార్కెట్లోకి మైలాబ్ టెస్ట్ కిట్!

Coviself

Coviself: కరోనాను కట్టడి చేయాలంటే మనముందున్న తొలిమార్గం కరోనా నిర్ధారణ పరీక్షలు. పరీక్షలు ఎంత ఎక్కువ చేస్తే మహమ్మారి వ్యాప్తికి అంత తక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యాధి నిర్ధారణ జరిగితే ఆ వ్యక్తి సమాజంలో తిరిగే అవకాశం తక్కువ ఉంటుంది. అయితే.. ఇప్పటికే మన దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలకు కొంత ఆలస్యమవుతుంది. దీనిని అధిగమించేలా ఇప్పుడు ఇంట్లోనే కరోనా నిర్ధారణ చేసుకొనేలా సెల్ఫ్ కిట్లు వస్తున్నాయి. అందులో మైలాబ్ కోవిసెల్ఫ్ కూడా ఒకటిగా చెప్పుకోవాలి.

కరోనా పరీక్షల్లో మరింత కచ్చితమైన ఫలితాల కోసం వాడే ఆర్​టీ-పీసీఆర్​ కిట్​ను గత ఏడాదిలో మైలాబ్ సంస్థ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు అదే సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో ఇంట్లోనే కరోనా నిర్ధారణ చేసుకొనేలా తొలి కిట్ ను రూపొందించింది. మైలాబ్ రూపొందించిన కోవిసెల్ఫ్ కిట్ వినియోగానికి ఇప్పటికే ఐసీఎంఆర్​ ICMR ఆమోదముద్ర వేయగా.. జూన్​ 1 నుండి ఈ టెస్ట్​ కిట్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు మైలాబ్ తెలిపింది.

పుణె కేంద్రంగా నడిచే ఈ కంపెనీ రూపొందించిన టెస్ట్​ కిట్​ను ‘కొవిసెల్ఫ్​’ పేరుతోనే మార్కెట్లో విక్రయించనుండగా ఈ కిట్​ ధర రూ.250 గా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. లొనావాలాలోని సంస్థ తయారీ కేంద్రంలో రోజుకు 10 లక్షల కిట్​ల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్లు మైల్యాబ్​ సహ వ్యవస్థాపకుడు శ్రీకాంత్​ పటోలే తెలిపగా.. రానున్న పది రోజుల్లో కోటి కిట్లను ఉత్పత్తి చేసి.. జూన్​ 1న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.