Covishield Dose Gap : కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం

కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని (గ్యాప్) తగ్గించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇప్పటిదాకా కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న వారు..(Covishield Dose Gap)

Covishield Dose Gap : కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం

Covishield Dose Gap

Covishield Dose Gap : కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని (గ్యాప్) తగ్గించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇప్పటిదాకా కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న వారు రెండో డోసు కోసం 12 నుంచి 16 వారాలు (84 రోజులు) ఆగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడా నిడివిని 8 నుంచి 16 వారాలకు తగ్గించాలని ఎన్టీఏజీఐ (నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్) కేంద్రానికి సిఫారసు చేసింది.

కాగా, భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా రెండు డోసుల మధ్య గడువులో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత కొవాగ్జిన్‌ రెండో డోసు అందిస్తున్నారు.(Covishield Dose Gap)

China Covid-19 Deaths : చైనాలో కరోనా విలయం.. రెండేళ్ల తర్వాత మొదలైన కరోనా మరణాలు..!

కొవిషీల్డ్ రెండో డోసును 8 వారాల తర్వాత కానీ.. 12-16 వారాల వ్యవధిలో ఇచ్చినప్పుడు కానీ యాంటీబాడీల పెరుగుదల దాదాపు సమానంగా ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా 6-7 కోట్ల మంది ప్రజలు కొవిషీల్డ్‌ సెకండ్ డోసును వేగంగా తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. NTAGI సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం గతేడాది మే నెలలో ఈ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధిని 6-8 వారాల నుంచి 12-16 వారాలకు పొడిగించింది.

కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించాయి. దీన్ని భారత్ కు చెందిన సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. కొవాగ్జిన్ ను హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా పరిశోధన సంస్థ అభివృద్ధి చేయడం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వి, కోర్బెవాక్స్ వంటి వ్యాక్సిన్లు ఇస్తున్నారు.

Covid Returns : ఆగ్నేయాసియాలో కరోనా ఉప్పెన.. నిర్లక్ష్యం వద్దు.. నాల్గో వేవ్ ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..!

మరోవైపు.. మూడో డోసుగా కొవిషీల్డ్ ను ​తీసుకుంటే ఒమిక్రాన్ ​వేరియంట్​ను ఎదుర్కోవచ్చని ఓ పరిశోధనలో తేలింది. కొవిషీల్డ్​ లేదా ఇతర ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్లు తీసుకున్న వారిపై ఆస్ట్రాజెనెకా సంస్థ ఈ పరిశోధనలు జరిపింది. కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ మూడో డోసు తర్వాత శరీరంలో బీటా, ఆల్ఫా, డెల్డా, గామా వేరియంట్లను కూడా ఎదుర్కొనే స్థాయికి రోగనిరోధక శక్తి చేరుకుంటుందని తెలిసింది. ఈ క్రమంలో జరిపిన పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. ఒమిక్రాన్​ను మరింత దీటుగా ఎదుర్కొనేలా వ్యాక్సిన్​ను తయారు చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు. కరోనా ఇంకా మనతోనే ఉంది. వైరస్ తీవ్రత కాస్త తగ్గింది అంతే. ఏ క్షణమైనా దేశంలో కరోనా విజృంభించే ఛాన్స్ లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. కరోనా తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉప్పెనలా విజృంభించవచ్చు అంటున్నారు. వాస్తవానికి కరోనా నాల్గో వేవ్ ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇజ్రాయెల్‌లో కొత్త వేరియంట్ బయటపడటం, చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా తీవ్రత పెరగడం.. లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి రావడం బెంబేలెత్తిస్తోంది.

కరోనా కారణంగా పరిస్థితులు మళ్లీ దారుణంగా మారిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా కేసులు తగ్గాయని సామాజిక దూరం, మాస్కులు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేస్తున్నారంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో కరోనా విజృంభణను ప్రస్తావిస్తూ దేశంలో పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దని అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్‌ వంటివి తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.