కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధర మరింత తగ్గింపు..

ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ధర మరింత తగ్గిపోయింది. యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ గురువారం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ధరను మరోసారి తగ్గించాం. రేట్ మళ్లీ తగ్గించి డోస్ రూ.200కంటే తక్కువ చేశామని సెక్రటరీ చెప్పారు.

కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధర మరింత తగ్గింపు..

covishield-

Covishield Vaccine: ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ధర మరింత తగ్గిపోయింది. యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ గురువారం మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ధరను మరోసారి తగ్గించాం. రేట్ మళ్లీ తగ్గించి డోస్ రూ.200కంటే తక్కువ చేశామని సెక్రటరీ చెప్పారు. కొత్త ఖరీదు రూ.157గా ఉండనున్నట్లు అధికారులు చెప్పారు.

జనవరి 16న వ్యాక్సినేషన్ మొదలుపెట్టకముందు తొలి దశలో డోస్ రూ.200వరకూ ఉంది. పైగా 100లక్షల డోసుల ఆర్డర్ పెట్టారు. ఆ తర్వాత దానిపై 10రూపాయలు అదనంగా వసూలు చేశారు.

భారత్ బయోటెక్ నుంచి వచ్చిన 38.5లక్షల డోసులు రూ.295కే ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ, భారత్ బయోటెక్ 16.5లక్షల డోసులు ఉచితంగానే అందించారు. ఎట్టకేలకు వ్యాక్సిన్ రూ.206కే అందింది. ఆ తర్వాత మరోసారి కోట్లలో డోసులను ముందు ధరకే పంపిణీ చేసింది కేంద్రం.

ప్రాధాన్యతను బట్టి వ్యాక్సినేషన్ పబ్లిక్ గా ఇచ్చారు. కొవాక్సిన్, కొవిషీల్డ్ సమానంగా అంటే రూ.250కే ఇచ్చారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ జోక్యమేమీ లేకుండా మొత్తం కేంద్రమే చూసుకుంటుంది. గురువారం వరకూ 2.56కోట్లకు మించిన కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఇందులోనే 60ఏళ్లు పైబడ్డ 60లక్షల మంది జనాభా కూడా ఉన్నారు.