Crazy Punishment: మద్యం తాగితే బోనులోఉండాల్సిందే..ఊరందకీ వేటమాంసంతో విందు ఇవ్వాల్సిందే..

ఆ గ్రామాల్లో మద్యం తాగితే రాత్రి అంతా బోనులో ఉండాలి. తెల్లవారాక జరిమానా కట్టాలి. ఆ తరువాత ఊరందరికి వేటమాసంంతో విందు ఇవ్వాలి. లేదంటే గ్రామ బహిష్కరణే అంటున్నారు పెద్దలు.

10TV Telugu News

Mutton Dawath : మద్యం తాగి వాహనం నడిపితే పోలీసులు ఫైన్ వేస్తారు. కానీ..తాగటం మానట్లేదు..తాగి నడపటం మానట్లేదు. కానీ మద్యపాన నిషేధం అమలులో ఉన్నాసరే మద్యం తాగుతుంటారు దొంగచాటుగా. అలా తాగితే..శిక్షలు వేయాలని నిర్ణయించుకున్నాయి మద్యపాన నిషేధం ఉన్న గుజరాత్ లోని కొన్ని గ్రామాల ప్రజలు వారికి వారే మద్యం తాగకూడదని కండిషన్ పెట్టుకున్నారు. దాన్ని అతిక్రమిస్తే వింత వింత శిక్షలు కూడా అమలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. అలా మద్యం తాగి దొరికిన వారిని రాత్రి అంతా బోనులో పెట్టి బంధించాలని..వారు విడుదల అయ్యాక ఈ ఊరివారి అందరికి మటన్ తో భోజనాలు పెట్టాలని నిర్ణయించారు. అలా ఆ గ్రామంలో ఎవరైనా తాగి దొరికితే ఆగ్రామస్తులందరికి మటన్ దావత్ ఇవ్వాల్సిందే.

గుజరాత్‌ లోని కొన్ని జిల్లాల్లో మద్యం తాగకుండా ఉండటానికి వింతైన నిబంధన పాటిస్తున్నారు. అహ్మదాబాద్, సురేంద్రనగర్‌, అమ్రేలీ, కచ్‌, మోతిపుర జిల్లాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది. దాన్ని అతిక్రమిస్తే శిక్షలు కూడా ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఊరి మధ్య బోను ఏర్పాటు చేశారు. ఎవరైనా మద్యం తాగి దొరికితే..వారిని రాత్రి అంతా ఆ బోనులో ఉంచుతారు. మరునాడు రూ. 12 వందలలు జరిమానా కట్టించుకుని వదిలేస్తారు. అంతేకాదు కథ అక్కడితో పూర్తి అవ్వదు. ఆ తరువాతే ఉంది అసలు కథ.ఆ బోనులో రాత్రి అంతా ఉన్నాక..విడుదల అయి జరిమానా కూడా కట్టాక ఆ తరువాత వారం రోజుల్లోపు గ్రామంలోని వారందరికీ 25వేల రూపాయల ఖర్చుపెట్టి.. మటన్‌ పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పార్టీకి గ్రామస్తులందరిని పిలవాలి. అలా జరిమానా కట్టకపోయినా..బోనులో ఉండటానికి ఇష్టపడకపోయినా వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు.

Read more : కిక్కిచ్చే న్యూస్.. రోజూ మద్యం తాగితే 90ఏళ్లు బతకొచ్చు.. కండీషన్స్ అప్లయ్!

ఈ బహిష్కరణలో భాగంగా..గ్రామంలో వారికి ఎవరు కూడా సాయం చేయకూడదు. వారిని ఎవరు పట్టించుకోవటం మానేయాలి. అలా కాకుండా ఉండాలి అంటే 25 వేలు ఖర్చు చేసి గ్రామస్తులందరికి మటన్ విందు ఇవ్వాల్సిందే. వినడానికి వింతగా అనిపించినా గ్రామస్తులంతా ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటున్నారు. పొరపాటున ఎవరైనా తాగితే పొరుగు ఊరిలోనో, లేదంటే గ్రామ శివారులో ఉండిపోవాలి. అలా గ్రామం చివర ఉండే పొలాల్లో ఉండాలి. కాదని ఊర్లోకి వస్తే పాతిక వేలతో విందు, 12వందల రూపాయలు గ్రామ పంచాయితికి జరిమానా..బోను శిక్ష తప్పదు.

ఆ ఊళ్లోకి ఎవరైనా తాగుబోతులు వచ్చారని గుర్తించి సమాచారం ఇవ్వటానికి కొందరు మహిళలను ఇన్‌ఫార్మర్లుగా నియమించారు. అలా తాగుబోతులను గుర్తించిన మహిళలకు 501 రూపాయల నుంచి 11వందల రూపాయలు బహుమానం కూడా ఇస్తున్నారు. తాగుబోతుల వివరాలు చెప్పిన మహిళల పేర్లు బయటకు రానివ్వరు.వారికి ప్రమాదం ఉంటుందని ఉద్ధేశ్యంతో..వారిని పేర్లను గోప్యంగా ఉంచుతారు.

Read more : ఏనుగు మలంతో మద్యం..! ఒక్కసారి తాగితే ‘వన్స్ మోర్’ అంటారట..!!

కచ్‌ జిల్లాలోని మాండ్వి మండలం గాధీసా గ్రామానికి చెందిన రాజన్ నాట్ 2021 ఏప్రిల్‌ నెలలో ఈ బోను శిక్షను అమల్లోకి తెచ్చారు. ఈ నిబంధనలతో తమ గ్రామాలు ప్రశాంతంగా ఉంటున్నాయని చెబుతున్నారు గ్రామ పెద్దలు. అంతేకాదు గతంలో తాగేవారు ఇప్పుడు తాగటం మానేశారు. దీంతో కుటుంబాల్లో గొడవలు కూడా ఉండటంలేదు. ముఖ్యంగా భార్య భర్తల మధ్య మద్యం గురించి జరిగే గొడవలు ఇప్పుడు లేవు. అలాగే మరి ముఖ్యంగా గతంలో తాగి తాగి చనిపోయేవారు. అలా తాగి చనిపోయిన వారి భార్యల కష్టాలే లేవిప్పుడు. ఇలా ప్రతీ గ్రామం నిర్ణయం తీసుకుంటే ఆనందకర జీవితాలు ప్రతీ కుటుంబంలోను ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి.