Corona Warriors : కాటి కాపరులు విధుల్లో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం : ప్రభుత్వం ప్రకటన

కరోనా సోకి చనిపోయినవారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయటానికి కాటి కాపరులకు 24 గంటలు సరిపోవటంలేదు. అంతగా మరణాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వం కాటికాపరులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించింది. విధుల్లో కాటికాపరులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ప్రకటించింది.

Corona Warriors : కాటి కాపరులు విధుల్లో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం : ప్రభుత్వం ప్రకటన

Corona Warriors

crematorium workers frontline warriors : ఈ కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయినవాళ్లు కాటికాపరులుగా మారి ఉపాధి పొందుతున్నారు. ఇంత దారుణ పరిస్థితులకు కరోనా కారణమైంది.బాధితులను  కాపాడటానికి వైద్య సిబ్బంది ఎంతగా పోరాడుతున్నారో తెలిసిందే. అలాగే కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేయటానికి కూడా తమ ప్రాణాలకు తెగించి కార్యక్రమాలు చేస్తున్నారు కాటికాపరులు.

కాటి కాపరి అనేది గతంలో ఓ వృతి. కానీ ఇప్పుడు నిరుద్యోగులకు ఉపాధిగా మారిపోయిన అత్యంత దుర్భర దుస్థితికి మహమ్మారి కొంతమంది బతుకులను దిగజార్చేసింది. కానీ కాటి కాపరులు కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేయటంలో కాస్త అజాగ్రతగా ఉన్నా వారి ప్రాణాలకే ప్రమాదం. కరోనా సోకే అవకాశాలు ఉండొచ్చు. వారితో పాటు వారి కుటుంబాలు కూడా ప్రమాదంలో పడొచ్చు. నేటి కరోనా మరణాల ప్రమాద స్థాయి ఎంతగా ఉందంటే మృతదేహాలకు అంత్యక్రియలు చేయటానికి వారికి 24 గంటలు సరిపోవటంలేదు.

కరోనా బాధితులను కాపాడటానికి వైద్యం సిబ్బంది అహోరాత్రులు శ్రమిస్తున్నారు. వారిని కరోనా యోధులుగా గౌరవిస్తున్నాం. అలాగే కరోనాతో చనిపోతే ఆ మృతదేహాలకు అంత్యక్రియలు చేసే కాటికాపరులు కూడా కరోనా యోధులే అంటూ గుర్తించింది గుజరాత్ ప్రభుత్వం. అటువంటి కరోనా యోధులకు అండగా ఉంటామంటోంది. విధుల్లో కాటికాపరులు చనిపోతే వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. కాటికాపరులను ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరోనా వారియర్స్ గా గుర్తించామని సీఎం విజయ్ రూపానీ బుధవారం (మే 12,2021) ప్రకటించారు. కాటికాపరులు శ్మశానవాటికలో విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం అందజేస్తామని సీఎం వెల్లడించారు.

దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా మృతదేహాలతో శ్మశానవాటికలన్నీ నిండిపోతున్నాయి. నిరంతరం 24 గంటలపాటు కాటికాపరులు మృతదేహాలకు దహనసంస్కారాలు నిర్వహిస్తూనే ఉంటున్నారు కాటికాపరులు. ఈ క్రమంలో శ్మశానవాటికల్లో పనిచేస్తున్న కాటికాపరులందరినీ కరోనా యోధులుగా గుర్తిస్తూ గుజరాత్ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న కాటికాపరులను ఏప్రిల్ 1వ తేదీ నుంచి కరోనా వారియర్స్ గా గుర్తించామని సీఎం విజయ్ రూపానీ ప్రకటించారు. కాటికాపరులు శ్మశానవాటికలో విధి నిర్వహణలో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం అందజేస్తామని తెలిపారు. దీంతో పాటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కరోనా బారిన పడితే వారి చికిత్సకు ‘మా కార్డు’, ‘వాత్స్యల్య కార్డు’ల కింద ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని సీఎం విజయ్ రూపానీ వెల్లడించారు.

కాగా.. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఉంది. రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 11,017 కరోనా కేసులు నమోదు కాగా.. 102 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7 లక్షలు దాటగా.. ఇప్పటివరకూ 8,731 మంది మరణించారు.