Home minister Amit Shah: రానున్న రోజుల్లో కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ అవసరం ఉండకపోవచ్చు: అమిత్ షా

ప్రస్తుతం కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం సహకారం అందిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాల అవసరం రానున్న రోజుల్లో ఉండకపోవచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు.

Home minister Amit Shah: రానున్న రోజుల్లో కాశ్మీర్లో సీఆర్పీఎఫ్ అవసరం ఉండకపోవచ్చు: అమిత్ షా

Amit

Home minister Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం సహకారం అందిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాల అవసరం రానున్న రోజుల్లో ఉండకపోవచ్చని సంచలన ప్రకటన చేశారు.జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో శనివారం జరిగిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 83వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి అమిత్ షా ప్రసంగింస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత రెండు దశాబ్దాలుగా కాశ్మీర్‌లో CRPF బలగాలు చేసిన యుద్ధం సామాన్యమైన విషయం కాదని, వారి కఠోర శ్రమ, త్యాగాల ఫలితంగా ఇప్పుడు కాశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కానుందని అమిత్ షా అన్నారు.

Also read: Kinzhal Hypersonic Missiles : యుక్రెయిన్‌పై రష్యా కొత్త అస్త్రం.. హైపర్ సోనిక్ మిస్సైళ్ల ప్రయోగం

సీఆర్పీఎఫ్ 83వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంమంత్రి అమిత్ షా సిఆర్‌పిఎఫ్‌ బలగాలను, అధికారులను ప్రశంసించారు. జమ్మూ కాశ్మీర్ లో త్వరలో శాంతిని పునరుద్ధరించగలమని తాను విశ్వసిస్తున్నానని, ఇక్కడ శాంతి నెలకొల్పడంలో సీఆర్పీఎఫ్ జవాన్ల పాత్ర కీలకంగా ఉందని ఆయన అన్నారు. “ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అయినా, కాశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదం కావచ్చు లేదా ఈశాన్య ప్రాంతంలోని తిరుగుబాటు శక్తులు కావచ్చు, అటువంటి సమూహాలను నిర్మూలించి మూడు ప్రాంతాలలో శాంతిని పునరుద్ధరించడంలో CRPF కీలక పాత్ర పోషించింది” అని అమిత్ షా ప్రశంసించారు.

Also read: Itarsi Junction: రైల్వేలో అత్యధిక ఆన్‌లైన్‌ ఫుడ్ ఆర్డర్లు ఆ స్టేషన్ నుంచే

దేశంలో ఎక్కడైనా అల్లర్లు జరిగితే, సిఆర్‌పిఎఫ్‌ని మోహరించడం వల్ల ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా నిద్రపోతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనికి దేశంలో అంతర్గత భద్రత అవసరమని అమిత్ షా అన్నారు. ఇందుకు సీఆర్పీఎఫ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సీఆర్‌పీఎఫ్‌కు ఆధునిక ఆయుధాలను సమకూర్చే దిశగా కృషి చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరించారు.

Also read: Japan – India: జపాన్ ప్రధానితో మోదీ భేటీ: ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ