Cordelia: విశాఖ చేరుకున్న విలాస నౌక ‘కార్డెలియా’.. సకల సౌకర్యాలతో అందుబాటులోకి

మూడు రోజులవరకు ఈ నౌకలో ప్రయాణించవచ్చు. పుదుచ్చేరి మీదుగా చెన్నై నుంచి విశాఖ.. విశాఖ నుంచి చెన్నై ప్రయాణించే వీలుంది. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు నౌకలో గడపవచ్చు. 11 అంతస్థులు కలిగిన ఈ నౌకలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.

Cordelia: విశాఖ చేరుకున్న విలాస నౌక ‘కార్డెలియా’.. సకల సౌకర్యాలతో అందుబాటులోకి

Cordelia

Cordelia: సకల సౌకర్యాలు కలిగిన విలాస, విహార నౌక ‘కార్డెలియా’ విశాఖ చేరుకుంది. పాండిచ్చేరి నుంచి చెన్నై మీదుగా ప్రయాణించి, ఈ నౌక బుధవారం విశాఖ తీరానికి చేరుకుంది. ఇకనుంచి ఈ నౌక పర్యాటకులకు సేవలు అందించనుంది. సముద్రం మీదుగా ప్రయాణించాలనుకునే వాళ్లకు ఇది మంచి అవకాశం. ఇది సముద్ర పర్యాటకుల కోసం తీర్చిదిద్దిన ప్రత్యేక విహారయాత్రా నౌక.

Cheetah: భారత్‌ రానున్న చీతాలు.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి

మూడు రోజులవరకు ఈ నౌకలో ప్రయాణించవచ్చు. పుదుచ్చేరి మీదుగా చెన్నై నుంచి విశాఖ.. విశాఖ నుంచి చెన్నై ప్రయాణించే వీలుంది. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు నౌకలో గడపవచ్చు. 11 అంతస్థులు కలిగిన ఈ నౌకలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో క్యాసినో, స్పా, బార్ రూమ్, స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటర్‌తోపాటు బోలెడన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ప్రయాణికులు సిబ్బంది కలిసి దాదాపు 1,800 మంది వరకు ప్రయాణించవచ్చు. టిక్కెట్ ధరలు మూడు కేటగిరీలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నౌక ప్రజల సందర్శన కోసం విశాఖ తీరంలో ఉంచారు. ఈ నౌకలో ప్రయాణించేందుకు బుకింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. సాయంత్రం పర్యాటక శాఖా మంత్రి రోజా నౌకలోని ప్రయాణికులకు వీడ్కోలు పలుకుతారు. ఈ నౌకను మూడు రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చెన్నై తీరంలో జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం విశాఖ పట్నం నుంచి ప్రయాణానికి అనుకూలమైన నౌక ఒక్కటే ఉంది. విశాఖ నుంచి అండమాన్ వరకు వెళ్లే ఈ నౌక నెలకు రెండుసార్లు మాత్రమే సేవలందిస్తుంది.

Covid-19: ఉధృతంగా కోవిడ్ వ్యాప్తి.. ఒక్క రోజులోనే 40 శాతం పెరిగిన కేసులు

అయితే, నౌకా ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునే వాళ్లలో అండమాన్ వెళ్లే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. దీంతో చాలా మంది ఈ ప్రయాణాన్ని ఎంచుకోవడం లేదు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ‘కార్డెలియా’ చెన్నై వరకు వెళ్తుంది. చెన్నై వెళ్లేవాళ్లు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, వాళ్లంతా నౌకాయానాన్ని ఎంజాయ్ చేసే వీలుంది. జూలై వరకు ఈ నౌక సేవలు కొనసాగుతాయి. వీటి ధరలు నౌకలో ఎంచుకునే రూమునుబట్టి.. రూ.27 వేల నుంచి రూ.1.27 లక్షల వరకు ఉన్నాయి. కొన్ని ఆన్‌లైన్ సంస్థల ద్వారా డిస్కౌంట్‌తో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.