IPL 2022: చెన్నైను కట్టుదిట్టం చేసిన సన్‌రైజర్స్

ఐపీఎల్ (IPL) 2022లో భాగంగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో జడేజా జట్టును హైదరాబాద్ ఘోరంగా కట్టడి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు..

IPL 2022: చెన్నైను కట్టుదిట్టం చేసిన సన్‌రైజర్స్

Csk Vs Srh

IPL 2022: ఐపీఎల్ (IPL) 2022లో భాగంగా జరుగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో జడేజా జట్టును హైదరాబాద్ ఘోరంగా కట్టడి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు నష్టపోయి సన్‌రైజర్స్‌కు 155పరుగుల టార్గెట్ ఇచ్చింది.

బౌలింగ్ విభాగంలో సత్తా చాటిన సన్‌రైజర్స్.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నైను కట్టుదిట్టం చేసింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చెన్నై ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (15), రుతురాజ్ గైక్వాడ్ (16) ఇద్దరూ స్వల్పస్కోర్లకే పెవిలియన్ పంపించారు. ఆ తర్వాత మొయిన్ అలీ (48), అంబటి రాయుడు (27) పర్వాలేదనిపించారు.

శివమ్ దూబే (3), ధోనీ (3) నిరాశపరచగా.. చివర్లో కెప్టెన్ రవీంద్ర జడేజా (23) మంచి షాట్లు ఆడి ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్ చివరి ఓవర్లో పెవిలియన్ చేరడంతో.. చివరి ఓవర్లో డ్వేన్ బ్రావో (8 నాటౌట్), క్రిస్ జోర్డాన్ (6 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

Read Also: చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్ న్యూస్

సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, మార్క్రమ్, మార్కో జాన్సెన్ తలో వికెట్ పడగొట్టారు.