Nasa Space Masala : అంతరిక్ష కేంద్రంలో మసలా దినుసుల సాగు…త్వరలో అందుబాటులోకి స్పేస్ మసాలా

అంతరిక్షంలోని మొక్కలు పెంచే గది చాలా చిన్నగా ఉంటుంది. మరో నాలుగు నెలల్లో మిరియాల పంట కోతకు రానున్నట్లు నాసా అధికారులు ట్విట్ చేశారు.

Nasa Space Masala : అంతరిక్ష కేంద్రంలో మసలా దినుసుల సాగు…త్వరలో అందుబాటులోకి స్పేస్ మసాలా

అంతరిక్ష కేంద్రంలో మిరియాల సాగు (2)

Nasa Space Masala : మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఏప్పుడో నిరూపితమైంది. నిరంతర అన్వేషణలో కొత్తకొత్త విషయాలను కనిపెడుతూ దాని ఫలాలు అందరికి అందించేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. సాధారణంగా భూమి పైనా పంటలు పండుతాయని అందరికి తెలుసు..కాని మన శాస్త్రవేత్తలు ఏకంగా అకాశంలో వేల మైళ్ళదూరంలో ఉన్న అంతరిక్ష కేంద్రంలో ఏకంగా పంటలు పండించేస్తున్నారు. ఇది నిజం.. 2016లోనే నాసా వ్యోమగామి షేన్ కింబ్రో విమాన ఇంజనీర్ అంతరిక్షంలో ఔట్రెడ్జియల్ రెడ్ రొమైన్ పాలకూరను పెంచి దానిని ఆహారంగా తీసుకున్న చరిత్ర ఉంది.

అయితే తాజాగా అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలు చిలీ మిరియాల సాగు చేపట్టారు. హాచ్ చిలీ మిరియాల విత్తనాలతో నాసా ప్లాంట్ హాబిటాట్ 04 , జూన్ నెలలో స్పేస్ ఎక్స్ 22వ మిషన్ లో అంతరిక్షానికి చేరింది. నాసా వ్యోమగామి షేన్ కింబ్రో చేపట్టిన ఈ మిరియాల సాగు ప్రయోగంలో 48 చిలీ పెప్పర్ విత్తనాలను అడ్వాన్స్ డ్ ప్లాంట్ హాబిటాట్ లో పండిస్తున్నారు.

అంతరిక్షంలోని మొక్కలు పెంచే గది చాలా చిన్నగా ఉంటుంది. మరో నాలుగు నెలల్లో మిరియాల పంట కోతకు రానున్నట్లు నాసా అధికారులు ట్విట్ చేశారు. అంతరిక్షంలో పెరుగుతున్న మిరియాలు న్యూ మెక్సికోకు చెందిన న్యూ మెక్స్ ఎస్పానోలా ఇంప్రూవ్డ్ హైబ్రిడ్ రకానికి చెందినవి. ఈ మిరియాల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అందుకే దీనిని అక్కడి వారు బాగా ఇష్టపడతారు.

నాసా మిరియాల సాగు గురించి తెలుసుకున్న వారంతా ఇక త్వరలో నాసా స్పైసెస్ రుచిచూసేందుకు మనమంతా సిద్ధంగా ఉండాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలో పండించే మసాలా దినుసులు కదా వాటి ధర కూడా అధికంగా ఉంటాయేమో వేచి చూడాలంటూ మరికొందరు అంటున్నారు.