UP, Maharashtra : కరోనా కల్లోలం, యూపీలో కర్ఫ్యూ పొడిగింపు, మహారాష్ట్రలో 960 మంది మృతి

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ ధాటికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అయినా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.

UP, Maharashtra : కరోనా కల్లోలం, యూపీలో కర్ఫ్యూ పొడిగింపు, మహారాష్ట్రలో 960 మంది మృతి

Up, Maharastra

Covid Deaths : కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ ధాటికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అయినా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. కొన్ని రాష్ట్రాలు కర్ప్యూ విధించాయి. పలు నిబంధనలు, ఆంక్షలను పొడిగిస్తున్నాయి. తాజాగా..యూపీ రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగిస్తూ..అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

2021 సీఎం యోగి అధ్య‌క్ష‌త‌న వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో కేబినెట్ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశంలో మరో వారం రోజులు క‌ర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. మే 17 వరకు కర్ప్యూ విధిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. గడువు సమీపిస్తుండడం..కర్ఫ్యూ వల్ల సత్ఫలితాలు ఇస్తుండడంతో నిబంధనలను పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయం మేరకు మే 24వ తేదీ ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.

మరోవైపు..మహారాష్ట్రలో మాత్రం కరోనా విలయతాండవం చేస్తోంది. 24 గంటల్లో 34,848 మందికి వైరస్ సోకిందని నిర్ధారించారు. అయితే..ఒక్కరోజులోనే 960 మంది మృతి చెందడం వైరస్ ఎంత మేర విజృంభిస్తుందో చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 80వేలు దాటింది. 24 గంటల్లో..59 వేల 073 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Read More : COVID 19 : తెలంగాణలో కరోనా..24 గంటల్లో 4 వేల 298 కేసులు