CWG 2022: 56దేశాలు సాధించలేని మెడల్స్ ఈ స్విమ్మర్ సొంతం

ఎమ్మా మెకన్ వయస్సు 28 సంవత్సరాలే అయినా ఆస్ట్రేలియా సెన్సేషన్. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆమె సాధించినన్ని మెడల్స్ 56దేశాలు కూడా దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ లో ఒక కాంస్యం, ఒక రజితం, ఆరు గోల్డ్ మెడల్స్ దక్కించుకుంది.

CWG 2022: 56దేశాలు సాధించలేని మెడల్స్ ఈ స్విమ్మర్ సొంతం

emme mckeon

 

 

CWG 2022: ఎమ్మా మెకన్ వయస్సు 28 సంవత్సరాలే అయినా ఆస్ట్రేలియా సెన్సేషన్. కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆమె సాధించినన్ని మెడల్స్ 56దేశాలు కూడా దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ లో ఒక కాంస్యం, ఒక రజితం, ఆరు గోల్డ్ మెడల్స్ దక్కించుకుంది.

మొత్తం 72దేశాలు పాల్గొన్న ఈవెంట్‌లో 16దేశాలు కేవలం 8 లేదా అంతకంటే ఎక్కువ మెడల్స్ సాధించాయంతే.

ఎమ్మా జెన్నీఫర్ మెకన్ 4X100 మీటర్ ఫ్రీస్టైల్ రిలే విభాగంలో నాలుగు సార్లు వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు. మొత్తం 11 ఒలింపిక్ మెడల్స్ కూడా సాధించారు. అందులో 2016లో రియో ఒలింపిక్స్ లో ఒకటి, 2020 టోక్యోలోని సమ్మర్ ఒలింపిక్స్ లో నాలుగు స్వర్ణాలు సాధించారు.

Read Also: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‎కు స్వర్ణపతకాల మోత

అధికారికంగా నిర్వహిస్తున్న ఈ 22వ కామెన్వెల్త్ గేమ్స్ .. (2022 కామన్వెల్త్ గేమ్స్) ఆగష్ట్ 8న ముగియనున్నాయి. ఈ ఈవెంట్ లో ఆస్ట్రేలియా మొత్తం 178 మెడల్స్ దక్కించుకోగా 67 స్వర్ణం, 57 రజితం, 54కాంస్య పతకాలు ఉన్నాయి. ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండ్ 176 పతకాలు అంటే 57 స్వర్ణం, 66 రజితం, 53 కాంస్యలు సాధించింది. మూడో స్థానంలో 92 పతకాలతో 26స్వర్ణాలు, 32 రజితాలు, 34 కాంస్య పతకాలతో మూడో స్థానంలో ఉన్నాయి.

ఇండియా మొత్తం 61 మెడల్స్ తో 22 స్వర్ణాలు, 16రజితం, 23కాంస్య పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.