Cyber Crime: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 60మంది అమ్మాయిల నుంచి రూ.4కోట్ల లూటీ

సోషల్ మీడియా వేదికగా తనకు తానుగా క్రేజ్ ఉన్న వ్యక్తిగా చిత్రీకరించుకుని దాదాపు రూ.4కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఫలితంగా అమెరికాలో ఉంటున్న హైదరాబాద్ అమ్మాయి దారుణంగా మోసపోయింది. ఫలితంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

Cyber Crime: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 60మంది అమ్మాయిల నుంచి రూ.4కోట్ల లూటీ

Pune Man Arrest

Cyber Crime: సోషల్ మీడియా వేదికగా తనకు తానుగా క్రేజ్ ఉన్న వ్యక్తిగా చిత్రీకరించుకుని దాదాపు రూ.4కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఫలితంగా అమెరికాలో ఉంటున్న హైదరాబాద్ అమ్మాయి దారుణంగా మోసపోయింది. ఫలితంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమ్మాయిలకు వల వేసి 60 మంది అమ్మాయిల నుంచి సుమారు 4కోట్ల రూపాయల వరకూ మోసాలకు పాల్పడ్డాడు రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ. బీటెక్ పూర్తి చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాడు.

ఆ అకౌంట్లతో తనను తాను హై ప్రొఫైల్ వ్యక్తిగా క్రియేట్ చేసుకుంటూ టార్గెట్ చేసుకున్న అమ్మాయిలతో చాటింగ్ చేశాడు. చాలా మంది అమ్మాయిలు ఇతగాడి ఫ్రెండ్‌షిప్ కోసం తపిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. అలా దాదాపు అందరినీ నమ్మించేశాడు. తనకు అవసరం ఉందని డబ్బులు అడగడం మొదలుపెట్టాడు.

Read Also: సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటి..

ఇలా అమెరికాలో ఉండే హైదరాబాద్‌కి చెందిన యువతి నుంచి 25 లక్షల రూపాయలు వసూలు చేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పిటీ వారెంట్‌పై అదువులోకి తీసుకొన్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. వంశీకృష్ణపై గతంలో రాచకొండ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, భీమవరం, వైజాగ్, కరీంనగర్, విజయవాడలలో ఇవే తరహా కేసులున్నాయి.