సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పీఎస్ ల్లో సైబర్ వారియర్

సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పీఎస్ ల్లో సైబర్ వారియర్

Cyber Warriors in Telangana ps : టెక్నాలజీ..టెక్నాలజీ..టెక్నాలజీ..ప్రపంచం అంతా టెక్నాలజీవైపే పరుగులు పెడుతోంది. ఈ టెక్నాలజీని మంచి కోసం కాకుండా చెడు కోసం ఉపయోగించేవారు పెరుగుతున్నారు. మంచి పక్కనే చెడు ఉన్నట్లుగా టెక్నాలజీ దుర్వినియోగంతో సైబర్ క్రైములు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ క్రైమ్ కు ఎంతోమంది బాధితులు అవుతున్నారు.

సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సైబర్ నేరాలను ఎంతగా కట్టడి చేద్దామని యత్నిస్తున్నా అవి రోజు రోజుకు పెరుగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీసుల డిపార్ట్ మెంట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతీ పోలీస్ స్టేషన్ లో నే ‘సైబర్ క్రైమ్’ యూనిట్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దీంతో ప్రతీ పోలీస్ స్టేషన్ లోను ఇక నుంచి సైబర్ క్రైమ్ నిపుణులు ఉంటారు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా సైబర్ వారియర్లను తయారుచేస్తోంది తెలంగాణ పోలీసులు శాఖ. ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ సైబర్ యోధులను నియమించినున్నారు. వారికి ట్రైనింగ్ ఇచ్చి తద్వారా వారిని సైబర్ యోధులుగా తీర్చి దిద్ది..సైబర్ నేరాలను అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకంటున్నారు.

సైబర్ క్రైమ్ కేసులపై టెక్నాలజీ సహాయంతో విచారణ జరపడం, ప్రజల్లో అవగాహన కలిగించడం చేయనున్నారు సైబర్ వారియర్స్. సైబర్ నేరాలను కట్టడి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా సైబర్ వారియర్ యూనిట్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.