D Srinivas Congress : మీకో దండం, మా ఇంటికి రావొద్దు, నన్ను లాగొద్దు.. కాంగ్రెస్‌లో చేరికపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న తనను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు డీఎస్. కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే..(D Srinivas Congress)

D Srinivas Congress : సీనియర్ నేత డి.శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరిక వ్యవహారంలో ట్విస్టులు మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. డిఎస్ ఊహించని ట్విస్టులు ఇస్తున్నారు. నిన్న కాంగ్రెస్ లో చేరినట్లు ప్రకటించిన డీఎస్.. ఇవాళ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపారు. తన కుమారుడు సంజయ్ చేరిక సందర్భంగానే తాను గాంధీభవన్ కు వెళ్లినట్లుగా లేఖలో పేర్కొన్నారు డీఎస్. అయితే, తాను మళ్లీ కాంగ్రెస్ లో చేరినట్లు ప్రచారం జరిగిందన్నారు.

Also Read..D Srinivas: తనయుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరిన డీఎస్.. ఠాక్రే, రేవంత్ సమక్షంలో చేరిక

కాంగ్రెస్ లో చేరిక వార్తలపై సీనియర్ నేత డి.శ్రీనివాస్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. తన కుమారుడు సంజయ్ చేరిక సందర్భంగానే తాను గాంధీ భవన్ కు వెళ్లినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆ సందర్భంగా తనకు కాంగ్రెస్ కండువా కప్పారని, దాంతో తాను మళ్ళీ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగిందన్నారు.(D Srinivas Congress)

Also Read..MLA Jagga Reddy : అద్వానీ ప్రధాని కాకుండా మోడీ కుట్రలు చేశారు- ఎమ్మెల్యే జగ్గారెడ్డి

అయితే, నేనెప్పటికీ కాంగ్రెస్ వాదినే అని డీఎస్ తేల్చి చెప్పారు. ప్రస్తుత ఆరోగ్యం దృష్ట్యా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నానని లేఖలో తెలిపారాయన. కాంగ్రెస్ లో నా చేరికకు, నా కుమారుడు సంజయ్ టికెట్ కు ముడిపెట్టడం సరికాదన్నారు డీఎస్. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న తనను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు డీఎస్. కాంగ్రెస్ లో నేను చేరినట్లు భావిస్తే.. ఇది నా రాజీనామా అనుకుని ఆమోదించగలరని ఖర్గేకు రాసిన లేఖలో కోరారు డీఎస్. మరోవైపు డీఎస్ సతీమణి కూడా ఖర్గేకు లేఖ రాశారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన డీఎస్ ను రాజకీయాల్లోకి లాగొద్దని ఖర్గేకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారామె.

తెలంగాణలోని సీనియర్ పొలిటీషియన్లలో ఒకరు ధర్మపురి శ్రీనివాస్. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన డీఎస్.. కొడుకు సంజయ్ తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్ సమక్షంలో కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చారని వినిపించింది. ఆదివారం ఉదయం వీల్ చైర్ పై సహాయకుడి సాయంతో గాంధీభవన్ కు వచ్చిన డీఎస్.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరలేదని చెప్పి ఆ పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు.(D Srinivas Congress )

ట్రెండింగ్ వార్తలు