Bihar Political Crisis: ‘బీజేపీని వెళ్ళగొట్టాలి’ అనే నినాదం బిహార్ నుంచి వస్తోంది.. అందరూ ఏకం కావాలి: అఖిలేశ్

బిహార్‌లో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గవర్నర్‌ను కలిసిన నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు కీలక పార్టీల నేతలు స్పందిస్తున్నారు. బ్రిటిష్ పాలనాకాలంలో ‘ఆంగ్లేయులు భారత్‌ను వీడాలి’ అనే నినాదాన్ని ఇదే రోజు ఇచ్చారని అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ‘బీజేపీని వెళ్ళగొట్టాలి’ అనే నినాదం ఇవాళ బిహార్ నుంచి వస్తోందని చెప్పారు. ఇటువంటి నినాదం ఇదే రోజు రావడం శుభపరిణామమని అన్నారు.

Bihar Political Crisis: ‘బీజేపీని వెళ్ళగొట్టాలి’ అనే నినాదం బిహార్ నుంచి వస్తోంది.. అందరూ ఏకం కావాలి: అఖిలేశ్

Bihar Political Crisis

Bihar Political Crisis: బిహార్‌లో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గవర్నర్‌ను కలిసిన నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు కీలక పార్టీల నేతలు స్పందిస్తున్నారు. బ్రిటిష్ పాలనాకాలంలో ‘ఆంగ్లేయులు భారత్‌ను వీడాలి’ అనే నినాదాన్ని ఇదే రోజు ఇచ్చారని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ‘బీజేపీని వెళ్ళగొట్టాలి’ అనే నినాదం ఇవాళ బిహార్ నుంచి వస్తోందని చెప్పారు. ఇటువంటి నినాదం ఇదే రోజు రావడం శుభపరిణామమని అన్నారు.

త్వరలోనే రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, కొద్ది సేపటి క్రితం గవర్నర్‌ను నితీశ్ కుమార్‌తో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కోరారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తమకు దేశ వ్యాప్తంగా తిరుగులేదని బీజేపీ నేతలు చెప్పుకుంటోన్న సమయంలో బిహార్ లో చోటు చేసుకున్న పరిణామం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది.

పట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయం వద్ద నితీశ్ కుమార్‌కు సంబంధించిన పలు పోస్టర్లు వెలిశాయి. నితీశ్ అందరివాడు అని పోస్టర్లలో పేర్కొన్నారు. గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ అనంతరం విభేదాల కారణంగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆర్జేడీతో దోస్తీ కట్టారు.