Drinking coffee: రోజూ ఇంత కాఫీ తాగితే ఎక్కువ కాలం బతికేయొచ్చు

కాఫీ తాగడం మంచిదో... చెడ్డదో ఎదుటివాళ్లు దగ్గర ఉన్న డేటాను బట్టి ఉంటుంది. కాఫీపై జరిపిన చాలా స్టడీల్లో బెనిఫిట్స్ ఉన్నాయనే తేలింది. లేటెస్ట్ గా జరిపిన స్టడీ...

Drinking coffee: రోజూ ఇంత కాఫీ తాగితే ఎక్కువ కాలం బతికేయొచ్చు

Driknig Cofee

Drinking coffee: కాఫీ తాగడం మంచిదో… చెడ్డదో ఎదుటివాళ్లు దగ్గర ఉన్న డేటాను బట్టి ఉంటుంది. కాఫీపై జరిపిన చాలా స్టడీల్లో బెనిఫిట్స్ ఉన్నాయనే తేలింది. లేటెస్ట్ గా జరిపిన స్టడీ కూడా ఇదే చెప్తుంది. రోజు కొంత మొత్తంలో తీసుకుంటే వారి జీవిత కాలం మెరుగవుతుందట.

కాఫీ అస్సలు తాగని వారు, రోజూ తాగే వారిపై స్టడీ జరిగింది. చుంగ్-అంగ్ యూనివర్సిటీ, కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ కలిసి స్టడీ నిర్వహించాయి. ఇందులో రోజూ కాఫీ తాగే వారిలో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్లు తేలింది. రోజుకు మూడు కప్పులకు మించి కాఫీ తాగాలట.

అలా చేసిన అభ్యర్థులు కార్డియో వాస్క్యూలర్ డిసీజ్ రిస్క్ తక్కువ ఎదుర్కొన్నారు. అస్సలు కాఫీ తాగని వారిలో ఈ కౌంట్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రీసెర్చర్లు ఇందులో లక్షా 73వేల 209మందిని పాల్గొనేలా చేశారు. 2004 నుంచి 2013వరకూ జరిపిన స్టడీలో 40ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న వారే పాల్గొన్నారు.

డయాబెటిస్, కార్డియో వాస్క్యూలర్ జబ్బు, క్యాన్సర్ లాంటి సమస్యలు లేనివారిపై స్టడీ జరిగింది. కాఫీ అస్సలు తాగని వారి కంటే రోజుకు మూడు నుంచి 5కప్పులు తాగే వారిలో జబ్బుల కారణంగా చనిపోయిన రేటు 15శాతం తక్కువగా కనిపించింది.