Viral Video: సెంచరీ బాది డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ తన గ్లోవ్స్‌ను చిన్నారికిచ్చిన వార్నర్.. ఉబ్బితబ్బిబ్బయిన బాలుడు

బాలుడు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఈ గ్లోవ్స్ తో పరుగులు తీస్తూ తన తల్లి, సోదరుడి వద్దకు వెళ్లి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘ఆ చిన్నారులు తమకు దక్కిన అదృష్టాన్ని నమ్మలేకపోయారు’’ అని పేర్కొంది. కాగా, డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ మ్యాచుల్లో చేసిన 44వ సెంచరీ ఇది.

Viral Video: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ స్టేడియంలో నేడు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ 102 బంతుల్లో 106 పరుగులు చేశాడు. అనంతరం ఓల్లీ స్టోన్ బౌలింగ్ లో డేవిడ్ విల్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్న సమయంలో తనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించిన ఓ చిన్నారికి డేవిడ్ వార్నర్ తన రెండు గ్లోవ్స్ తీసి ఇచ్చాడు.

దీంతో ఆ బాలుడు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఈ గ్లోవ్స్ తో పరుగులు తీస్తూ తన తల్లి, సోదరుడి వద్దకు వెళ్లి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘ఆ చిన్నారులు తమకు దక్కిన అదృష్టాన్ని నమ్మలేకపోయారు’’ అని పేర్కొంది. కాగా, డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ మ్యాచుల్లో చేసిన 44వ సెంచరీ ఇది.

వన్డేల్లో చేసిన 20 సెంచరీ. 1,043 రోజుల్లో డేవిడ్ వార్నర్ చేసిన తొలి శతకం కూడా ఇదే. వార్నర్ 2020 జనవరి 14న చివరి సెంచరీ (128 నాటౌట్) చేశాడు. మళ్ళీ నేడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండులో శతకం బాదగలిగాడు. కాగా, నేటి మ్యాచులో ఇంగ్లండ్ ముందు ఆస్ట్రేలియా 356 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఆస్ట్రేలియా 31.4 ఓవర్ల వద్ద 142 పరుగులకే ఆలౌట్ అయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా 221 పరుగులతో ఘన విజయం సాధించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు