David Warner: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం.. టెస్టులకు గుడ్‌బై.. అదే ఆఖరి సిరీస్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయితే తన నిర్ణయం ఇప్పుడే అమల్లోకి రాదని వచ్చే ఏడాది సొంత గడ్డ(ఆస్ట్రేలియా) పై పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ పార్మాట్ నుంచి తప్పుకోనున్న వార్నర్ శనివారం వెల్లడించాడు.

David Warner
Warner: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయితే తన నిర్ణయం ఇప్పుడే అమల్లోకి రాదని వచ్చే ఏడాది సొంత గడ్డ(ఆస్ట్రేలియా) పై పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్ అనంతరం సుదీర్ఘ పార్మాట్ నుంచి తప్పుకోనున్న వార్నర్ శనివారం వెల్లడించాడు. తన కెంతో ఇష్టమైన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోనే ఆఖరి మ్యాచ్‌ను ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
శనివారం బెకెన్‌హామ్‌లో ప్రాక్టీస్‌కు ముందు వార్నర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. 2024 టీ20 ప్రపంచకప్ తనకు ఆఖరి మ్యాచ్ అవుతుందనే విషయాన్ని వార్నర్ మరోసారి చెప్పాడు. అయితే అంతకు ముందు టెస్టుల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం భారత్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం వార్నర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ ముగియగానే ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ ఆడనుంది.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాను భయపెడుతున్న చెత్త రికార్డు
‘ప్రపంచకప్‌లో పరుగులు సాధిస్తే ఆసీస్‌కు ఆడతానని నా కుటుంబానికి మాట ఇచ్చాను. పాకిస్థాన్‌తో సిరీస్ తరువాత వెస్టిండీస్ సిరీస్ మాత్రం ఆడడం లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్‌ల్లో రాణిస్తే ఖచ్చితంగా పాకిస్థాన్ సిరీస్‌కు ఎంపిక అవుతా. అదే నా ఆఖరి టెస్టు మ్యాచ్ అవుతుందని’ వార్నర్ చెప్పుకొచ్చాడు.
గత కొంత కాలంగా వార్నర్ పేలవ ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్నాడు. గత రెండు సంవత్సరాల్లో 17 టెస్టులు ఆడిన వార్నర్ కేవలం ఒకే ఒక శతకాన్ని అందుకున్నాడు. వార్నర్ ఇప్పటి వరకు ఆసీస్ తరుపున 103 టెస్టుల్లో 45.6 సగటుతో 8,158 పరుగులు చేశాడు.
2024లో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు
టెస్టు క్రికెట్ రిటైర్‌మెంట్ అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్లు వార్నర్ చెప్పాడు. 2024 ప్రపంచకప్‌లో ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. ఆతరువాత పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తానని చెప్పాడు. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాంచైజీ క్రికెట్ మాత్రం ఆడనున్నట్లు వెల్లడించాడు.