Dawood Ibrahim: పీఎం పదవిపై కన్నేసిన దావూద్ ఇబ్రహీం గర్ల్‌ఫ్రెండ్..?

పాకిస్తాన్ నటి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ గా రూమర్లు వినిపించే మెహ్విష్ హయత్ ఏదో ఒక రోజు పాకిస్తాన్ ప్రధాని అవుతానని చెబుతున్నారు. రీసెంట్ గా Geo TVతో జరిపిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చూసి ఇన్‌స్పైర్ అయ్యానని ఏదో ఒక రోజు ఆ సీట్ లో కూర్చుంటానని చెప్పారు.

Dawood Ibrahim: పీఎం పదవిపై కన్నేసిన దావూద్ ఇబ్రహీం గర్ల్‌ఫ్రెండ్..?

Pak (1)

Dawood Ibrahim: పాకిస్తాన్ నటి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ గా రూమర్లు వినిపించే మెహ్విష్ హయత్ ఏదో ఒక రోజు పాకిస్తాన్ ప్రధాని అవుతానని చెబుతున్నారు. రీసెంట్ గా Geo TVతో జరిపిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చూసి ఇన్‌స్పైర్ అయ్యానని ఏదో ఒక రోజు ఆ సీట్ లో కూర్చుంటానని చెప్పారు.

ఆమె కెరీర్ ను పాలిటిక్స్ లోకి ఫోకస్ చేస్తారా అని చెప్పిన దానికి.. ఇన్షా అల్లాహ్.. (దేవుడు అనుకుంటే తప్పకుండా) అని చెప్పారు హయత్. పాకిస్తాన్‌ను పాలిస్తున్న Tehreek-e-Insaf partyను చూసి ఇన్‌స్పైర్ అయ్యారని అన్నారు.

వాళ్ల రాజకీయాలు చూసి ప్రేరణ పొందాను. ఎందుకంటే సమాజంలో చేసిన మార్పులు ఉదహారణగా చెప్పుకునేంత గొప్పగా ఉన్నాయి. రాజకీయాలకు రాకముందు ఇమ్రాన్ ఖాన్ ఒక క్రికెటర్.. క్రికెటర్ ప్రధాని అయినప్పుడు యాక్టర్లు కూడా కచ్చితంగా ప్రధాని అవగలరు.

అంటే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పోటీపడి ఆ పదవిని దక్కించుకుంటారా అని అడిగిన ప్రశ్నకు.. ప్రధాని మంత్రి పదవికి కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారంతే.

ఇమ్రాన్ ఖాన్ ను ఛాలెంజ్ చేయాలనుకోవడం లేదు. మరెవరైనా ఆ స్థానానికి పోటీ చేయాలనుకుంటే అప్పుడు నేను కూడా పోటీ చేస్తా అన్నారు.

దావూద్ ఇబ్రహీంతో హయత్ రిలేషన్‌షిప్ గురించి రీసెంట్ గా చాలా రూమర్లు వినిపించాయి. 27ఏళ్ల పెద్ద వాడైన దావూద్ తో రిలేషన్ పెట్టుకుందంటూ.. మెహవీష్ హయత్ ను ఐటెం సాంగ్ లో చూసిన డాన్ మనసు పారేసుకున్నారంటూ వార్తలు వినిపించాయి. అప్పటి నుంచి ఆమె ఖాతాలో పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయట.