నాల్గవ రోజు ముగిసిన ఆట.. గెలుపు కోసం పోరాడుతారా? స్కోరు 39/1

నాల్గవ రోజు ముగిసిన ఆట.. గెలుపు కోసం పోరాడుతారా? స్కోరు 39/1

ఇంగ్లాండ్‌తో చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు నాలుగోరోజు ఆట ముగిసింది. ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 178 పరుగుల వద్ద ఆలౌటైంది. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ దెబ్బకు ఇంగ్లండ్‌ విలవిల్లాడగా… వరుసగా వికెట్లను కోల్పోయింది. అశ్విన్‌ ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. వరుస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్‌ రెండొందల పరుగుల మార్కు చేరకుండా కట్టడి చేసింది టీమిండియా. ఇంగ్లండ్‌ 419 పరుగుల ఆధిక్యంలో నిలవగా.. బర్న్స్‌, సిబ్లే, స్టోక్స్‌, డొమినిక్‌ బెస్‌, జోఫ్రా ఆర‍్చర్‌, అండర్సన్‌ వికెట్లను అశ్విన్‌ సాధించాడు. నదీమ్‌కు రెండు వికెట్లు లభించగా, ఇషాంత్‌, బుమ్రాలకు చెరొక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 578 పరుగులు చేయగా, టీమిండియా 337 పరుగులకు ఆలౌటైంది.

తొలి టెస్టులో 420పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 39/1తో నాల్గవ రోజుని ముగించగా.. క్రీజులో ఓపెనర్ శుభమన్ గిల్ (15 బ్యాటింగ్: 25 బంతుల్లో 3×4), చతేశ్వర్ పుజారా (12 బ్యాటింగ్: 23 బంతుల్లో 1×4) ఉన్నారు. మ్యాచ్‌లో ఇక మంగళవారం ఆట మాత్రమే మిగిలి ఉండగా.. టీమిండియా విజయానికి 381 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ (12: 20 బంతుల్లో 1×4, 1×6) అవుటయ్యాడు. మూడు సెషన్ల పాటు మిగిలిన 9 వికెట్లతో టీమిండియా గెలుపు కోసం పోరాడుతుందా..? లేదా డ్రా కోసం ప్రయత్నిస్తుందా..? అనేది చూడాలి.

చెపాక్ స్టేడియంలో ఈరోజు పిచ్ స్పిన్నర్లకు అనుకూలించగా.. భారీ స్కోరు చెయ్యకుండా ఆపగలిగింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. 578 పరుగులు చేయగా.. తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది భారత్.. 241 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మొత్తంగా 420 పరుగుల టార్గెట్ టీమిండియా ముందు ఉండగా.. అందులో ఈరోజు 39పరుగులు చేసింది భారత్..