Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తి.. తీర్పు రేపటికి వాయిదా

మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తైంది. దీనిపై తీర్పు కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. రేపు ఉదయం తీర్పు వెలువడుతుంది.

Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తి.. తీర్పు రేపటికి వాయిదా

Jacqueline Fernandez: మనీ లాండరింగ్ కేసుతో సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో అరెస్టైన బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తైంది. తీర్పును కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జాక్వెలిన్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Sania Mirza: సానియా-షోయబ్ ఇప్పటికే విడిపోయారా? అసలు విషయం చెప్పిన స్నేహితులు

ఈ బెయిల్ గడువు ఈ రోజు (నవంబర్ 10)తో పూర్తవుతుంది. దీంతో రెగ్యులర్ బెయిల్ కోసం ఆమె గతంలోనే ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టును ఆశ్రయించింది. గురువారం ఉదయం ఈ బెయిల్ పిటిషన్ విచారణ కోసం జాక్వెలిన్ కోర్టుకు హాజరైంది. అయితే, తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది. అయితే, జాక్వెలిన్‌కు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ వాదించింది. కేసు విచారణలో ఆమె ఏమాత్రం సహకరించలేదని, పైగా తన సెల్‌ఫోన్ నుంచి ఆధారాల్ని డిలీట్ చేసిందని, అలాగే దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిందని ఈడీ అరోపించింది. ఆధారాలు చూపించినప్పుడు మాత్రమే ఈ కేసులో తన పాత్రను ధృవీకరించిందని, ఈ నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ అభిప్రాయపడింది.

Lalu Prasad Yadav: లాలూ కుమార్తె గొప్ప మనసు.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు అంగీకారం… సింగపూర్‌లో శస్త్రచికిత్స

అయితే, బెయిల్‌ మంజూరు విషయంలో తీర్పు శుక్రవారం వెలువడుతుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. సుకేష్ చంద్రశేఖర్‌తో కొంతకాలం సన్నిహితంగా ఉంది. ఈ సమయంలో సుకేష్ ఆమెకు ఖరీదైన కానుకలు కూడా ఇచ్చాడు. సుకేష్ రూ.200 కోట్ల స్కాంకు పాల్పడ్డాడని ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో సుకేష్‌తోపాటు జాక్వెలిన్ పేరును కూడా ఈడీ అధికారులు చార్జిషీట్‌లో చేర్చారు.