Fake Notes: 2018-19 నుండి తగ్గిన నకిలీ రూ.2వేల నోట్ల చెలామణి

2018-19 నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ.2వేల నోట్ల చెలామణి తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్ సభకు తెలిపింది. బీజేపీ ఎంపీ రంజన్ బెన్ ధనంజయ్ భట్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ సమాధానమిచ్చారు.

Fake Notes: 2018-19 నుండి తగ్గిన నకిలీ రూ.2వేల నోట్ల చెలామణి

Fake Notes: 2018-19 నుండి బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ.2వేల నోట్ల చెలామణి తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్ సభకు తెలిపింది. 2018 నుంచి 2020 సంవత్సరాల మధ్యలోనకిలీ కరెన్సీ నోట్ల చెలామణి ఎక్కువగానే ఉన్నప్పటికీ, 2021-2022లో బ్యాంకింగ్ వ్యవస్థలో కనుగొనబడిన రూ. 2వేల నకిలీ నోట్ల సంఖ్య 13,604 ఉన్నట్లుగా తెలిపింది. ఈ నకిలీ నోట్ల చెలామణిలో రూ. 2వేల నోట్లు 0.000635శాతమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చెప్పారు.

Nitish kumar: బీజేపీ టార్గెట్ నితీష్ ‭కుమారేనా?

రూ.2వేల నకిలీ నోట్ల సంఖ్య పెరిగిపోయిందా? ఈ ఘటనలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై బీజేపీ ఎంపీ రంజన్ బెన్ ధనంజయ్ భట్ సంధించిన ప్రశ్నకు పంకజ్ స్పందించారు. 2018లో మొత్తం 54,776 నకిలీ రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకోగా, 2019 సంవత్సరంలో 90,556 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో((NCRB) డేటాను ప్రస్తావిస్తూ సహాయ మంత్రి రాజ్యసభకు వెల్లడించాడు.

‘Ram Setu’stone : నదిలో తేలుతున్న ‘రామ్’అనే అక్షరాలున్న పెద్ద ‘రాయి’

ఓ సారి 2,44,834 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని, నకిలీ నోట్లలో 90% తక్కువ నాణ్యతతో ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, అయినప్పటికీ అవి భారతీయ కరెన్సీకి సంబంధించిన అన్ని ప్రధాన భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయని తెలిపారు. నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిని అరికట్టేందుకు పలు చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధిక-నాణ్యత గల నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను (FICN) పరిశోధిస్తుందని, FICN కోఆర్డినేషన్ గ్రూప్ (FCORD) సహాయంతో రాష్ట్రాలు, కేంద్రంలోని వివిధ భద్రతా ఏజెన్సీల మధ్య గూఢచారాన్ని పంచుకుంటుందని తెలిపారు.