Deer Zindagi: డీర్ జిందగీ.. ట్రాఫిక్ రూల్స్‌పై ఆకర్షిస్తున్న వీడియో..

యూపీ పోలీసులు తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఒక జింక రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే, రోడ్డుపై కార్లు వెళ్తుండటంతో కాస్సేపు ఆగుతుంది. తర్వాత వాహనాలు ఆగిన తర్వాత నెమ్మదిగా జీబ్రా క్రాసింగ్‌పై నడుచుకుంటూ వెళ్తుంది.

Deer Zindagi: డీర్ జిందగీ.. ట్రాఫిక్ రూల్స్‌పై ఆకర్షిస్తున్న వీడియో..

Deer Zindagi

Deer Zindagi: రోడ్డుపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అది వాహనాలపై వెళ్లేవాళ్లైనా, నడుచుకుంటూ వెళ్లేవాళ్లైనా. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్స్ వంటివి కచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ రూల్స్ ఫాలో అయితే, చాలు.. ఎక్కువ ప్రమాదాల్ని నివారించవచ్చు. అందుకే బాధ్యత కలిగిన చాలా మంది పౌరులు రూల్స్ ఫాలో అవుతుంటారు.

Chardham Yatra: ఛార్‌ధామ్ యాత్ర.. 48 మంది మృతి

అయినా, కొందరు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ, రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురవుతుంటారు. ఇలాంటి వాళ్లకు కనువిప్పు కలిగేలా, మార్పు వచ్చేలా యూపీ పోలీసులు తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఒక జింక రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే, రోడ్డుపై కార్లు వెళ్తుండటంతో కాస్సేపు ఆగుతుంది. తర్వాత వాహనాలు ఆగిన తర్వాత నెమ్మదిగా జీబ్రా క్రాసింగ్‌పై నడుచుకుంటూ వెళ్తుంది. మనుషులు కూడా పాటించేందుకు ఆలోచించే ట్రాఫిక్ రూల్‌ను ఒక జింక పాటించడం విశేషం.

Gyanavapi Mosque: జ్ఞానవాపి మసీదు అరుదైన చిత్రం చెప్పే అత్యంత ఆసక్తికర కథ..

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు యూపీ పోలీసులు. దీనికి ‘డీర్ జిందగీ’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. జీవితం ఎంతో విలువైందని, జింకలాగే రోడ్డు భ్రదతా ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాలు జరగవని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.