IAF Chopper Crash : సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ సహా 13మంది మృతి.. సంతాపం తెలిపిన రక్షణ మంత్రి

తమిళనాడులో సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది ఆకస్మిక మరణం..

IAF Chopper Crash : సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ సహా 13మంది మృతి.. సంతాపం తెలిపిన రక్షణ మంత్రి

IAF Chopper Crash : తమిళనాడులో సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది ఆకస్మిక మరణం తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. బిపిన్ రావత్ అకాల మరణం భారత సైనిక బలగాలకు, దేశానికి తీరని లోటు అన్నారు.

జనరల్ రావత్ అసాధారణమైన ధైర్యం, శ్రద్ధతో దేశానికి సేవ చేశారని రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా (త్రివిధ దళాధిపతి) రావత్ సాయుధ దళాల ఉమ్మడి ప్రణాళికలను సిద్ధం చేశారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఈ ప్రమాదంలో మొత్తం 13మంది చనిపోయారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే బతికున్నారు. ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని రాజ్ నాథ్ సింగ్ ప్రార్థించారు.

Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..

భారత త్రివిధ దళాల చరిత్రలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్-త్రివిధ దళాధిపతి) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులో హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య మధులిక రావత్ కూడా కన్నుమూశారు. మరో 10 మంది సైనికాధికారులు, హెలికాప్టర్ పైలెట్ కూడా ఈ దుర్ఘటనలో మరణించారు. ఈ మేరకు రావత్ మృతిని భారత వాయుసేన ధ్రువీకరించింది. చాపర్ లోని 14మందిలో 13 మంది చనిపోయారంటూ ఐఏఎఫ్ ట్వీట్ చేసింది.

ప్రమాదం జరిగిన తర్వాత రావత్ ప్రాణాలతో ఉన్నారని, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రచారం జరిగింది. అయితే రావత్ సంఘటనా స్థలంలోనే చనిపోయినట్టు వెల్లడైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని భారత వాయుసేన ప్రకటించింది. రావత్ మరణంతో సైనిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలడానికి కారణాలు ఇవేనా..!

సూలూరు నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి వెళ్తుండగా మధ్యాహ్నం 12:20 నిమిషాలకు హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) దర్యాప్తునకు ఆదేశించింది.

తమిళనాడులోని కూనూరు సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనలో 13మంది కన్నుమూశారు. హెలికాప్టర్ లో మొత్తం 14మంది ఉన్నారు. వారిలో 13మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. దీంతో డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించనున్నారు.

సీడీఎస్ బిపిప్ రావత్ సహా 14మంది ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పవర్ ఫుల్ హెలికాప్టర్ కూలడానికి కారణమేంటి? అనే ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాంతికేతిక లోపమా? కరెంటు తీగలను తాకడమా? తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల కూలిందా? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. లేదా ఎవరైనా రావత్ ను టార్గెట్ చేసి మిస్సైస్ దాడికి పాల్పడ్డారా అన్న అనుమానాలు వస్తున్నాయి.