Delhi Bazar: వ్యాపారులు కోసం కొత్త వెబ్ పోర్ట‌ల్ : సీఎం కేజ్రివాల్‌

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీకి చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్త‌లు, వృత్తి నిపుణుల కోసం కొత్త వెబ్ పోర్ట‌ల్‌ను తీసుకురానుంది.

Delhi Bazar: వ్యాపారులు కోసం కొత్త వెబ్ పోర్ట‌ల్  : సీఎం కేజ్రివాల్‌

Delhi Bazar

Delhi Bazar: ఢిల్లీ సీఎం అరవింత్ కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి చెందిన వ్యాపార‌ులు, పారిశ్రామికవేత్త‌లు, వృత్తి నిపుణుల కోసం ప్రభుత్వం కొత్త వెబ్ పోర్ట‌ల్‌ను తీసుకురావాల‌ని నిర్ణ‌యించామని బుధవారం (నవంబర్ 3,2021) సీఎం అర‌వింద్‌ కేజ్రివాల్ వెల్ల‌డించారు. ‘ఢిల్లీ బ‌జార్’ పేరుతో ఒక వెబ్ పోర్ట‌ల్‌ను సిద్ధం చేస్తున్నామ‌ని..దీని ద్వారా వ్యాపార‌ులు, పారిశ్రామిక‌వేత్త‌లు, వృత్తి నిపుణులు త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌మోట్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. దీని ద్వారా ఆదాయం మెరుగు పరుచుకోవచ్చని..తద్వారా స్థూల దేశీయోత్పత్తి, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. వచ్చే ఆగస్టు నాటికి ఇది సిద్ధమవుతుందని వెల్లడించారు. ఈ పోర్టల్ వర్చువల్ ఎగ్జిబిషన్ లా ఉపయోగపడుతుందని వ్యాపారులు తమ ఉత్పత్తుల్ని విదేశాలలో కూడా విక్రయించుకోవచ్చని తెలిపారు.

Read more : Telangana Vaccine : తెలంగాణాలో దీపావళి రోజు వాక్సిన్‌కు హాలిడే..

అలాగే కరోనా గురించి పలు సూచనలు చేశారు. ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. అలాగని అజాగ్తగా ఉండొద్దని సూచించారు. ప్ర‌జ‌లు దీపావ‌ళి పండుగ స‌రంజామా కోసం మార్కెట్ల‌కు పోటెత్తుతున్నారు. ర‌ద్దీ ప్రాంతాల్లోనూ జ‌నం మాస్కులు లేకుండా క‌నిపిస్తున్నారు. ద‌య‌చేసి అంద‌రూ ఫేస్ మాస్కులు ధరించండి..కరోనాను పూర్తిగా నివారించటానికి సహకరించాలని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. కరోనా విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి దీన్ని పూర్తిగా నియంత్రించాలంటే ప్రతీ ఒక్కరు బాధ్యతగా ఉండాలని కోరారు. డెంగీ కేసులు కూడా పెరుగుతున్నాయని, ప‌రిస‌రాల్లో నిలువ నీరు లేకుండా పరిశుభ్రతగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. డెంగీని నివార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కేజ్రివాల్ కోరారు.

Read more : Delhis Air Pollution : దీపావళికి ముందే..కాలుష్యంతో మసకబారుతున్న ఢిల్లీ