Modern well : రోజుకు 90 లక్షల లీటర్ల నీళ్లిచ్చే టెక్ బావి.. త్వరలోనే అందుబాటులోకి!

రోజుకు 90 లక్షల నీరునందించే ఆధునిక బావిని నిర్మిస్తోంది సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం. ఈ టెక్ బావి అందుబాటులోకి వస్తే ఇక నగరంలో నీటి కొరత ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

Modern well : రోజుకు 90 లక్షల లీటర్ల నీళ్లిచ్చే టెక్ బావి.. త్వరలోనే అందుబాటులోకి!

90 Lakh Liters Of Water

CM kejriwal govt is build a modern well : నగరవాసులకు నీళ్లు సరఫరా టాప్ ల ద్వారానే అందుతుంది. మరి నీటి కొరత ఏర్పడితే ఏంటీ పరిస్థితి? అందుకే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ఓ టెక్ బావిని రూపొందిస్తోంది. ఈ టెక్ బావి త్వరలోనే అందుబాటులోకి రానుందట. ఈ బావి అందుబాటులోకి వస్తే రోజు 90 లక్షల నీరు లభిస్తుందని తెలిపింది ప్రభుత్వం. అక్షరధామ్ వద్ద నిర్మిస్తున్న ఆధునిక బావి నిర్మాణం ఈబావి నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఈక్రమంలో బావుల నిర్మాణ పనులను ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సోనియా ఈ బావి నిర్మాణ పనుల్ని పరిశీలించారు. ఢిల్లీ ప్రభుత్వం..ఇరిగేషన్ అండ్ ఫుడ్ కంట్రోల్((I&FC) సంయుక్తంగా ఈ ఆధునిక బావిని నిర్మిస్తున్నాయి. ఇది కాకుండా..సోనియా విహార్ వద్ద నిర్మిస్తున్న మరొక ఆధునిక బావిని ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ జల్ బోర్డ్ నిర్మిస్తోంది.

ఈ బావిలో నిర్మించే గోడలకు పలు రంధ్రాలు ఉంటాయి. తద్వారా నీటి ఊటంతా బావిలోకి చేరుతుంది ఒకసారి ఈ బావి పూర్తిగా నిండితే..రోజుకు ఈ బావి నుంచి 90 లక్షల లీటర్ల నీరు లభ్యమవుతుందని ఇరిగేషన్ ఇంజనీర్ తెలిపారు.ఈ బావి నుంచి వచ్చే నీటిని పలు అవరాలకు వినియోగించుకోవచ్చని ..ముఖ్యంగా తాగునీటి అవసరాలను ఈ బావిలోని నీరు తీరుస్తుందని తెలిపారు. ఆరు మీటర్ల వ్యాసార్థంతో ఈ బావి నిర్మితమవుతోంది. ఈ బావి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఈ బావి అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఈ బావి ఆరు మీటర్ల వెడల్పుతో 30 మీటర్లు లోతు ఉంటుంది. ఇప్పటికే 12 మీటర్ల లోతు బావి నిర్మాణం పూర్తి అయ్యింది. ఇంకా పని పూర్తికావాల్సి ఉంది. ఈ సంవత్సరం చివరినాటికి ఈ టెక్ బావులు అందుబాటులోకి వచ్చేలా అధికారులు పనుల్ని శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఢిల్లీ జల్ బోర్డ్ ప్రకారం..ఈ బావిని సోనియా విహార్‌లో పైలట్ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. ఇలాంటి బావులు అందుబాటులోకి వచ్చా ఇంకా పలు ప్రాంతాల్లో ఇటువంటి బావుల నిర్మాణం చేపట్టే యోచనలు కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ బావులు అధిక భూగర్భ జలాల రీఛార్జ్ జోన్లలో మాత్రమే నిర్మించబడతాయి. ఇక్కడ నీరు సహజంగా రీఛార్జ్ అవుతుంది. కాబట్టి, సోనియా విహార్ అటువంటి భూగర్భ జలాల రీల రీఛార్జ్ ప్రాంతం, ఇక్కడ నీరు 4 మీటర్ల లోతులో కనిపిస్తుంది. అందుకే ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయడానికి ఈ ప్రదేశం ఎంపిక చేయబడింది.