Delhi Covid: ఢిల్లీలో తగ్గిన కరోనా కేసులు.. రోజువారీ లెక్కలు ఇవే..!

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి.

Delhi Covid: ఢిల్లీలో తగ్గిన కరోనా కేసులు.. రోజువారీ లెక్కలు ఇవే..!

Corona (3)

Delhi Covid: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. అయితే, బుధవారంతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

సాయంత్రం 6.30 గంటలకు ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 12 వేల 306 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 43 మంది కరోనాతో మరణించారు. ఇదే సమయంలో 24గంటల్లో 18వేల 815మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మహానగరంలో కరోనా ఇన్ఫెక్షన్ రేటు 21.48 శాతంగా ఉండగా.. 68 వేల 730 యాక్టీవ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. ఢిల్లీలో బుధవారం 13785 కేసులు నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్ రేటు 23.86 శాతంగా ఉంది.

ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు:

Date New Cases Deaths Positivity Rate Tests
20 జనవరి 12306 43 21.48% 57290
19 జనవరి 13785 35 23.86% 57776
18 జనవరి 11684 38 22.47% 52002
17 జనవరి 12527 24 27.99% 44762
16 జనవరి 18286 28 27.87% 65621
15 జనవరి 20718 30 30.64% 67624
14 జనవరి 24383 34 30.64% 79578
13 జనవరి 28867 31 29.21% 98832
12 జనవరి 27561 40 26.22% 105102
11 జనవరి 21259 23 25.65% 82884
10 జనవరి 19166 17 25% 76670
09 జనవరి 22751 17 23.53% 96678
08 జనవరి 20181 7 19.60% 102965
07 జనవరి 17335 9 17.73% 97762
06 జనవరి 15097 6 15.34% 98434
05 జనవరి 10665 8 11.88% 89742