మందుబాబులకు గుడ్ న్యూస్ : కరోనా పన్ను లేదు..ఈ కూపన్ కంపల్సరీ

  • Published By: madhu ,Published On : June 8, 2020 / 05:14 AM IST
మందుబాబులకు గుడ్ న్యూస్ : కరోనా పన్ను లేదు..ఈ కూపన్ కంపల్సరీ

మందుబాబులకు ఢిల్లీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యంపై విధిస్తున్న 70 శాతం కరోనా పన్నును ఎత్తివేయబోతోంది. ఎల్లుండి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అన్ని రకాల మద్యం బాటిళ్లకూ ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. మద్యం ధరలపై అదనపు పన్నుల భారం వేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని గ్రహించిన సీఎం కేజ్రీవాల్… ఈ టాక్సును ఎత్తి వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

అయితే… టాక్సును ఎత్తివేసినా ప్రజలు లిక్కర్ షాపుకి వెళ్లాలంటే మాత్రం ఈ-కూపన్ తీసుకోవాల్సిందే. ఈ-కూపన్ కారణంగా… ఏ టైముకి మద్యం షాపుకి వెళ్లాలో టైమ్ స్లాట్ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో వెళ్లడం వల్ల కరోనా టెన్షన్లు లేకుండా… సోషల్ డిస్టెన్స్‌తో మద్యం కొనుక్కునే ఛాన్స్ ఉంది. 

దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. అయితే… ఈ కేసుల సంఖ్య  నెలాఖరు నాటికి లక్ష దాటే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక నిపుణుల కమిటీ అంచనా వేసింది. కొవిడ్‌ మహమ్మారి కాటుకు ఢిల్లీ విలవిల్లాడుతోంది. ప్రతిరోజు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవడంతోపాటు మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది. 

సోమవారం నుంచి ప్రార్థనాలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు పూర్తి స్థాయిలో తెరవనుండటంతో ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్నది ఆందోళన కలిగిస్తోంది. 2020, జులై 08వ తేదీ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో 27 వేల 654కి కేసులు నమోదవగా…761 మంది చనిపోయారు. 

 

Read:  భారత్ లో కరోనా…2.56 లక్షల కేసులు..7 వేల మంది మృతి