Delhi Govt : యమునా నది కాలుష్యం నియంత్రణ కోసం వాటిపై నిషేధం

యమునా నదిలో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఐఎస్‌ ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల విక్రయాలను నిషేధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యమునా మానిటరింగ్ కమిటీ సిఫారసు చేయటంతో ప్రభుత్వం వాటిని బ్యాన్‌ చేసింది. ఈ నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Delhi Govt : యమునా నది కాలుష్యం నియంత్రణ కోసం వాటిపై నిషేధం

Yamuna River Polu

Yamuna river pollution : యమునా నదిలో అంతకంతకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించటానికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఐఎస్‌ ప్రమాణాలు లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌ను ప్రభుత్వం నిషేధించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల విక్రయాలను నిషేధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యమునా మానిటరింగ్ కమిటీ సిఫారసు చేయటంతో ప్రభుత్వం వాటిని బ్యాన్‌ చేసింది. ఈ నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత విభాగాలపై నియంత్రణ ఉన్న స్థానిక సంస్థలు, పౌర సరఫరా విభాగాలు, జిల్లా పరిపాలన సహా సంబంధిత అధికారులందరూ నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంట్లో భాగంగా తనిఖీలు చేపట్టాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ సోమవారం (జూన్ 14,2021) ఉత్తర్వులు జారీ చేసింది.

దీనికి సంబంధించి ప్రతీనెలా నివేదికలను సమర్పించాలని కాలుష్య నియంత్రణ సంస్థ సంబంధిత అధికారులకు తెలిపింది. నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ జనవరిలో ఇద్దరు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసులను అంగీకరించింది. బీఐఎస్‌ ప్రమాణాలకు అనుగుణంగా లేని డిటర్జెంట్ల ప్రొడక్టుల అమ్మకం, వాటిని నిల్వ చేయటం, రవాణాలతో పాటు మార్కెటింగ్‌ను నిషేధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల వాడితే కలిగే ప్రమాదం గురించి..ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని ఎన్జీటీ ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది.

యమునా నది కాలుష్యకారకంగా మారటానికి ప్రధాన కారణం..సబ్బులు, డిటర్జెంట్లు కూడా కారణమని నిపుణులు పేర్కొన్నారు. యమునా నదిలో తేలియాడే విషపూరితమైన నురుగు దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ మారిన విషయం తెలిసిందే. అధిక ఫాస్పేట్ కంటెంట్ ఉన్న రంగుల పరిశ్రమలు, ధోబీ ఘాట్లు, నివాసాల్లో ఉపయోగించే సబ్బులు, డిటర్జెంట్ల వ్యర్ధాలు యమునా నది నీరు విషపూరితంగా మారుతోందనీ..వాటి వల్లనే నీటిలో నురుగు ఏర్పడటానికి ప్రధాన కారణమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి తెలిపారు.