govt employees : కేజ్రివాల్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్..

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ఢిల్లీ రోడ్లపై వాహనాలకు సరి, బేసి సంఖ్యల విధానాన్ని..

govt employees : కేజ్రివాల్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్..

Electric Vehicles

govt employees :  ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ఢిల్లీ రోడ్లపై వాహనాలకు సరి, బేసి సంఖ్యల విధానాన్ని అమలు చేస్తుంది. అయినప్పటికీ ఢిల్లీ కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రక్కులు, ట్రాక్టర్ల తర్వాత ద్విచక్ర వాహనాలు రెండవ అతిపెద్ద వాయు కాలుష్యాన్ని వెదజల్లే కారకాలుగా దోహదపడుతున్నాయి. దీంతో వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్లేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Delhi Rozgar Budget 2022 : ఢిల్లీలో వచ్చే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం : కేజ్రీవాల్ సర్కార్ టార్గెట్!

ఎలక్ట్రిక్ వాహనాల వాటాను 2024 నాటికి మొత్తం అమ్మకాలలో 25శాతానికి పెంచేందుకు ఇప్పటికే ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసుకొనేందుకు ఈఎంఐ సదుపాయాన్ని కల్పించింది. అంతేకాక మొదటి పదివేల ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు దారులకు 25శాతం ప్రోత్సాహాన్ని అందించనుంది. అంతేకాక మొదటి వెయ్యి ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు అదనంగా మరో రూ.2వేలు ప్రోత్సాహకం అందించేందుకు ఆప్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Delhi Kejriwal : దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా

ఢిల్లీలో నూతన వాహన రిజిస్ట్రేషన్లలో ద్విచక్ర వాహనాలు (స్కూటర్లు, మోటార్ సైకిళ్లు) మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయని, రాజధానిలో వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంలో ఈ విధానం సహకరిస్తుందని ఓ అధికారి వెల్లడించారు. అధికారిక అంచనాల ప్రకారం.. ఢిల్లీ ప్రభుత్వంలో రెండు లక్షల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఢిల్లీ రోడ్లపై దాదాపు 1.33 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయి. వాటిలో 67శాతం ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.