Delhi Govt: ఢిల్లీలో 20ఏళ్లుగా ఉంటున్నా ఎటువంటి సాయం అందలేదంటోన్న రెజ్లర్ దివ్య కక్రాన్

కామన్వెల్త్ మెగా ఈవెంట్ సందర్భంగా భారత్ పేరిట పతకాలు నమోదవుతున్న వేళ ఇండియన్ రెజ్లర్ దివ్య కక్రాన్ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జరిగిన పోటీలో టైగర్ లిలీ కోకర్ లెమలీని 2-0తో ఓడించింది. అలా కామన్వెల్త్ గేమ్స్‌లో కక్రాన్ రెండో మెడల్ సొంతం చేసుకుంది.

Delhi Govt: ఢిల్లీలో 20ఏళ్లుగా ఉంటున్నా ఎటువంటి సాయం అందలేదంటోన్న రెజ్లర్ దివ్య కక్రాన్

 

 

Delhi Govt: కామన్వెల్త్ మెగా ఈవెంట్ సందర్భంగా భారత్ పేరిట పతకాలు నమోదవుతున్న వేళ ఇండియన్ రెజ్లర్ దివ్య కక్రాన్ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జరిగిన పోటీలో టైగర్ లిలీ కోకర్ లెమలీని 2-0తో ఓడించింది. అలా కామన్వెల్త్ గేమ్స్‌లో కక్రాన్ రెండో మెడల్ సొంతం చేసుకుంది. గోల్డ్ కోస్ట్ వేదికగా 2018లో కాంస్యం దక్కించుకున్న దివ్య పేరిట ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రెండు మెడల్స్ ఉన్నాయి.

2022 ఎడిషన్‌ ముగింపు తర్వాత, కక్రాన్‌కు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు అందాయి. ఈ సందర్భంగా భారతీయ రెజ్లర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రిక్వెస్ట్ చేశారు.

“నా పతక విజయానికి అభినందనలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. ఢిల్లీలో 20ఏళ్లుగా ఉంటున్నా. రెజ్లింగ్ అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ, నేనెప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రైజ్ మనీ అందుకోలేదు. ఎటువంటి సాయానికి కూడా నోచుకోలేదు” అంటూ అరవింద్ కేజ్రీవాల్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు.

Read Also: కామన్వెల్త్‌‌ గేమ్స్‌: భారత బాక్సర్లకు గోల్డ్ మెడల్.. కాంస్య పతకం సాధించిన మహిళా హాకీ టీమ్

“ఇతర స్టేట్లకు ప్రాతినిధ్యం వహించకుండా ఢిల్లీకే ప్రాధాన్యమిస్తున్నందుకు ఢిల్లీలో పుట్టిన రెజ్లర్ల మాదిరిగా నన్ను కూడా పరిగణించండి” అంటూ రాసుకొచ్చారు. దాంతో పాటుగా 2018లో సీఎం కేజ్రీవాల్‌కు చేసిన అదే రకమైన రిక్వెస్ట్ వీడియోను కూడా పోస్ట్ చేసింది దివ్య కక్రాన్.