Delhi Corona Cases : దేశ రాజధానిలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 86శాతం పెరిగిన కేసులు

భారీ సంఖ్య‌లో కరోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న‌టి రోజున న‌మోదైన కేసుల కంటే ఈరోజు 86శాతం అధికంగా కేసులు న‌మోదైన‌ట్టు ఆరోగ్య‌శాఖ తెలిపింది. ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళనకు..

Delhi Corona Cases : దేశ రాజధానిలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 86శాతం పెరిగిన కేసులు

Delhi Corona Cases

Delhi Corona Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం రేపింది. భారీ సంఖ్య‌లో కరోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఢిల్లీలో 923 కేసులు న‌మోదైన‌ట్టు ఆరోగ్య‌శాఖ చెప్పింది. నిన్న‌టి రోజున న‌మోదైన కేసుల కంటే ఈరోజు 86శాతం అధికంగా కేసులు న‌మోదైన‌ట్టు ఆరోగ్య‌శాఖ తెలిపింది. ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.

ఒక్క‌సారిగా 86శాతం మేర కేసులు పెర‌గ‌డంతో అధికారులు అలర్ట్ అయ్యారు. క‌రోనా క‌ట్ట‌డికి మరిన్ని కీల‌క చ‌ర్య‌లు తీసుకోనున్నారు. కాగా, క‌రోనా నుంచి 344 మంది కోలుకోగా ఒక్క మ‌ర‌ణం కూడా న‌మోదు కాలేదని వైద్యారోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొంది.

Coronavirus France : ఫ్రాన్స్‌లో కరోనా కల్లోలం.. రికార్డు స్థాయిలో 2 లక్షలకు చేరిన కొత్త రోజువారీ కేసులు

ఇప్ప‌టికే ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూ లాంటి ఆంక్ష‌లు విధించారు. ఎల్లో అల‌ర్ట్ కూడా ప్ర‌క‌టించారు. దీంతో సినిమా హాళ్లు, స్కూళ్ల‌ను మూసేశారు. 50 శాతం కెపాసిటీతో హోట‌ళ్లు, మెట్రోలు, బార్లు, రెస్టారెంట్లు న‌డుస్తున్నాయి. ఎన్ని కేసులు వ‌చ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామ‌ని, ఆసుప‌త్రుల‌ను సిద్ధం చేసుకున్నామ‌ని, త‌గినంత ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ఉంద‌ని ఇప్ప‌టికే ఢిల్లీ ప్రభుత్వం ప్ర‌క‌టించింది. మరోవైపు న్యూఇయర్ వేడుక‌ల‌పైనా ఇప్ప‌టికే ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే.

Mark Zuckerberg: వ్యవసాయంలోకి మార్క్ జూకర్‌బర్గ్, రూ.127కోట్లతో స్థలం కొనుగోలు

నిన్న ఢిల్లీలో 496 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడా సంఖ్య ఏకంగా 923కి పెరిగింది. ఒక్కరోజులో ఇన్ని కేసులు పెరగడం గత ఆరు నెలల కాలంలో ఇదే తొలిసారి. 923 కరోనా కేసులు నమోదవగా, అందులో 73 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 238కి పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం 2వేల 191 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,45,102. ఢిల్లీలో ఇప్పటివరకు 25వేల 107మంది కరోనాతో చనిపోయారు.