రిపబ్లిక్ డే విన్యాసాల్లో..‘రాఫెల్’తో మొదటి మహిళా ఫైటర్ పైలట్ భావనా కాంత్

రిపబ్లిక్ డే విన్యాసాల్లో..‘రాఫెల్’తో మొదటి మహిళా ఫైటర్ పైలట్ భావనా కాంత్

Delhi : the first female pilot Bhavana Kant with ‘Raphael’ in Republic Day :  జనవరి 26. భారత గణతంత్రదినోత్సవం. ఈ సంవత్సరం గణతంత్రదినోత్సవంలో వైమానిక విన్యాసాల్లో తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా లెఫ్టినెంట్ భావనా కాంత్ పాల్గొననున్నారు. యుద్ధవిమానం ఏదైనా..భావనాకాంత్ చేతిలో ఆడబొమ్మే. అంత చాకచక్యంగా నడిపి శెభాష్ అనిపించుకోగల దిట్ట భావనాకాంత్. మిగ్ -21 విమానాన్నికూడా సోలోగా నడిపేస్తుంది. ఈఏడాది గణతంత్ర (రిపబ్లిక్ డే) వైమానిక దళ విన్యాసాల్లో పాల్గొననుంది.

తొలి మహిళా యుద్ధ విమాన పైలట్​గా రికార్డుకెక్కిన భావనాకాంత్ గురించి మరిన్ని విషయాలు. రొటీన్ లైఫ్..రొటీన్ జాబ్స్ కంటే ఛాలెంజింగ్ లే ఇష్టం. అందుకే తొలి మహిళా యుద్ధ విమాన పైలట్​గా రికార్డుకెక్కి ఆకాశంలో గెలుపు సంతకంచేశారు భావనా కాంత్. 2014లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఓ ఎమ్ ఎన్ సి కంపెనీలో చేరిన భావన అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. ఆకాశపు అంచులు తాకాలని అనుకున్నారు. తన లక్ష్యం సాధించటానికి ఎంతో కష్టపడింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్​లో పైలట్ కావాలనే తన చిన్ననాటి కలను నిజం చేసుకోవాలనుకుని ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఎయిర్ ఫోర్స్ లోకి అడుగుపెట్టింది.

ముగ్గురిలో ఒకరు..ఆ ముగ్గురిలో భావనా స్టైలే వేరు..
2016లో ఒకేసారి ఎయిర్ ఫోర్స్​లోకి ముగ్గురు అమ్మాయిలు పైలట్లుగా చేరారు. ఆ ముగ్గురిలో భావనా కాంత్ ఒకరు. కానీ ఆ ముగ్గురిలో ఒక్కరిగా కాకుండా తనకంటూ ఓ స్పెషాలిటీని దక్కించుకుంది. ఆ ఇద్దరి కంటే ముందు యుద్ధ పోరాటాల్లో పొల్గొనే ఛాన్స్ దక్కించుకుంది. మిగ్ విమానాలు నడిపిన మొదటిమహిళగా రికార్డ్ సాధించి చూపెట్టింది.

అన్నింటిలోనూ టాప్ లోనే భావన
ఫైటర్ పైలట్ అవడమంటే మాటలు కాదు. ఎంతో కష్టపడాలి. ఎన్నో దశల్లో ట్రైనింగ్ పొందాలి. ఈ ట్రైనింగ్ చాలా కష్టంగా..కఠినంగా ఉంటుంది. కానీ ఇష్టమైతే కష్టం తెలీదు అన్నట్లుగా కఠిన శిక్షణను అవలీలగా సాధించేసింది. ఈ ట్రైనింగ్ లో భాగంగా ముందుగా ఫైటర్ జెట్స్ నడపడంలో ట్రైనింగ్ ఇస్తారు. యుద్ధాలు జరిగేటప్పుడు విమానాన్ని ఎలా నడపాలి? వెపన్స్​ని ఎలా ఉపయోగించాలి? అనే విషయంలో చాలాకీలకమైనది ఆ ట్రైనింగ్ లో భాగం.

ఆ తర్వాత డే ఆప్స్ లో ఫైటర్ జెట్ నడిపే ట్రైనింగ్ ఇస్తారు. అంటే యుద్ధం పగలు జరిగితే..విమానాన్నిఎలా నడపాలి?అదే రాత్రి సమయంలో జరిగితే శత్రువులతో ఎలా పోరాడాలనే టెక్నిక్స్ పై ట్రైనింగ్ ఇస్తారు. దాన్ని కంప్లీట్ చేస్తేనే..డే ఆప్స్ లో జరిగే ఆపరేషన్ లో పాల్గొనేందుకు పర్మిషన్ ఇస్తారు. ఈ పర్మిషన్ పొందాలంటే అన్నింటిలోనూ ఆరితేరి ఉండాలి. వీటన్నింటిని భావానాకాంత్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి.. రాజస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ ఫ్రంట్ లైన్ బేస్ లో 3-స్క్వాడ్రన్ లో మిగ్-21 బైసన్ ఫైటర్ పైలట్ గా ట్రైనింగ్ పూర్తిచేసి సెకండ్ స్టేజ్ కి వెళ్లింది. ఒంటరిగా యుద్ధ విమానాన్ని (ఫైటర్ జెట్) నడిపే పైలట్ అయ్యింది.

Delhi the first female pilot Bhavana Kant with 'Raphael' in Republic Day

ఆకాశంలో గెలుపు సంతకం చేసిన మధ్యతరగతి అమ్మాయి
భావనా కాంత్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. భావనా తండ్రి నారాయణ్ కాంత్, తల్లి రాధా కాంత్. తండ్రి ఇంజనీర్. బీహార్​లోని దర్భాంగలో పుట్టి పెరిగిన భావనకు చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలనేది కలలు కన్నది. కోకో, బ్యాడ్మింటన్ ఆటలు బాగా ఆడుతుండడంతో క్రీడాకారిణి అవ్వాలని సలహా ఇచ్చేవాళ్లు. కానీ..భావనా కలలు వేరు..ఆమె లక్ష్యం వేరు..ఆటలు తన హాబీలు మాత్రమే లక్ష్యం కాదనే విషయం వారికి తెలీదు. తన లక్ష్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ అవ్వటమేనని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆ మిడిల్ క్లాస్ అమ్మాయి చెబుతుంటే ఆశ్చర్యపడేవారు అందరూ. ఆమె కలలు కన్నట్లుగా వాటిని సాకారం చేసుకుని ప్రస్తుతం అడ్వాన్స్​డ్​ ఫైటర్ జెట్​లు నడుపుతోంది భావనా.

మిగ్ 21 బైసన్ స్క్వాడ్రన్ తో ఆకాశంలో చక్కర్లు కొడుతోంది. 2020, మార్చి9న ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఆమె ‘నారీ శక్తి పురస్కార్’ అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నెం.3 స్క్వాడ్రన్ కోబ్రాస్​కు షిప్ట్ అయ్యారు. ఇన్ని ఘనతలు సాధించిన భావన ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో జరిగే వైమానిక దళ విన్యాసాల్లో మొట్టమొదటిసారి పాల్గొని, తొలి మహిళా యుద్ధ విమాన పైలట్ గా మరో రికార్డ్ సాధించబోతుంది. హ్యాట్సాఫ్ భావనా కాంత్..