Delhi liquor scam: నిందితుల కస్టడీని మరోసారి పొడిగించాలని కోరనున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రముఖుల పేర్లు, నగదు లావాదేవీల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జెట్ సెట్ గో ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన వారి వివరాలు, ఎయిర్ పోర్టుల్లో సీసీటీవీ నుంచి ఆధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సేకరించారు. విమాన ప్రయాణాలు, సౌత్ గ్రూప్ నగదు లావాదేవీలకు సంబంధించిన అంశాలపై శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్, విజయ్ నాయర్ ను ఈడీ ప్రశ్నిస్తోంది. రేపటితో శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు ఈడీ కస్టడీ ముగుస్తోంది.

Delhi liquor scam: నిందితుల కస్టడీని మరోసారి పొడిగించాలని కోరనున్న ఈడీ

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రముఖుల పేర్లు, నగదు లావాదేవీల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జెట్ సెట్ గో ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన వారి వివరాలు, ఎయిర్ పోర్టుల్లో సీసీటీవీ నుంచి ఆధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సేకరించారు. విమాన ప్రయాణాలు, సౌత్ గ్రూప్ నగదు లావాదేవీలకు సంబంధించిన అంశాలపై శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్, విజయ్ నాయర్ ను ఈడీ ప్రశ్నిస్తోంది. రేపటితో శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు ఈడీ కస్టడీ ముగుస్తోంది.

వారి కస్టడీని మరోసారి పొడిగించాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కంపెనీలకు లబ్ధి చేకూరేలా కోట్ల రూపాయలు సేకరించి పంజాబ్ ఎన్నికలకు వినియోగించారని ఆప్ పై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ తెలపనుంది. కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విచారణ జరిపిన కొద్దీ ప్రముఖుల పేర్లు బయటకు వస్తుండడం గమనార్హం. తాజాగా, శరత్ చంద్రా రెడ్డి భార్య కనికా టేక్రివాల్ సంస్థ జెట్ సెట్ గో విమానాల్లో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన డబ్బును హైదరాబాద్ తరలించినట్లు ఈడీ గుర్తించింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..