Delhi: కుక్క మొరిగింద‌ని దాని య‌జ‌మాని కుటుంబంపై రాడ్‌తో దాడి.. వీడియో

కుక్క మొరిగింద‌ని దాని య‌జ‌మాని కుటుంబంపై ఐర‌న్‌ రాడ్‌తో దాడి చేశాడు ఓ వ్య‌క్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీలో రికార్డ‌య్యాయి.

Delhi: కుక్క మొరిగింద‌ని దాని య‌జ‌మాని కుటుంబంపై రాడ్‌తో దాడి.. వీడియో

Attack

Delhi: కుక్క మొరిగింద‌ని దాని య‌జ‌మాని కుటుంబంపై ఐర‌న్‌ రాడ్‌తో దాడి చేశాడు ఓ వ్య‌క్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీలో రికార్డ‌య్యాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ప‌శ్చిమ విహార్ ప్రాంతంలో ర‌క్షిత్ అనే వ్య‌క్తి కుటుంబం నివ‌సిస్తోంది. ర‌క్షిత్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఇంటి ముందు నిల‌బ‌డి ఉన్నాడు. ర‌క్షిత్‌ పెంచుకుంటోన్న కుక్క ఇంటి ప‌క్క‌న ఉండే వ్య‌క్తిని చూసి మొరిగింది. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన ఆ వ్య‌క్తి ఐర‌న్ రాడ్‌తో దూసుకొచ్చాడు. మొద‌ట కుక్క‌ను ఐర‌న్ రాడ్‌తో కొట్ట‌డంతో అది ప‌డిపోయింది.

Modi: కాసేప‌ట్లో ఏపీకి ప్ర‌ధాని మోదీ.. ప్రధానితో క‌లిసి అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో పాల్గొననున్న జగన్

ఆ త‌ర్వాత ర‌క్షిత్‌పై కూడా ఆ వ్య‌క్తి రాడ్‌తో దాడి చేశాడు. దీంతో ఆయ‌న త‌ల‌కి తీవ్ర‌గాయ‌మైంది. ఇంత‌లో ర‌క్షిత్ కుటుంబంలోని ఒక‌రు వ‌చ్చి దాడి చేస్తోన్న వ్య‌క్తిని ఆప‌బోయారు. అత‌డికి కూడా గాయాల‌య్యాయి. ఇంటి ప‌క్క‌న ఉండే వ్య‌క్తి చేసిన దాడిపై పోలీసుల‌కు ర‌క్షిత్ ఫిర్యాదు చేశారు. ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదుచేశామ‌ని, అలాగే, జంతువుల‌పై హింస నిరోధ‌క చ‌ట్టం కింద కూడా కేసు న‌మోదైంద‌ని పోలీసులు తెలిపారు. ర‌క్షిత్ కుటుంబంపై దాడి జ‌రిగిన ఘ‌ట‌నపై పూర్తి వివ‌రాలు రాబ‌డుతున్నామ‌ని చెప్పారు.