Delhi Metro: కేబుల్ ఎత్తుకెళ్లిన దొంగలు.. నెమ్మదిగా నడుస్తున్న మెట్రో రైళ్లు

సిగ్నలింగ్ కేబుల్‌ను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఢిల్లీ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. సిగ్నలింగ్ వ్యవస్థను సపోర్ట్ చేసే కేబుల్‌లోని కొంతభాగాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు.

Delhi Metro: కేబుల్ ఎత్తుకెళ్లిన దొంగలు.. నెమ్మదిగా నడుస్తున్న మెట్రో రైళ్లు

Delhi Metro

Delhi Metro: సిగ్నలింగ్ కేబుల్‌ను దొంగలు ఎత్తుకెళ్లడంతో ఢిల్లీ మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. సిగ్నలింగ్ వ్యవస్థను సపోర్ట్ చేసే కేబుల్‌లోని కొంతభాగాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో మెట్రో రైలు సేవలు నెమ్మదించాయి. అక్షర్‌ధామ్-మయూర్ విహార్ ఫేజ్-1 మధ్య నడిచే మెట్రో రైలుకు సంబంధించిన కేబుల్‌ ఎత్తుకెళ్లడంతో, ఈ రెండు స్థానాల మధ్య రైలు నెమ్మదిగా నడిచింది. దీని ప్రభావంతో బ్లూ లైన్ రైలు సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది.

Modi: టోక్యోలో బైడెన్‌తో భేటీ కానున్న మోదీ

ఇటీవలి కాలంలో ఇలా కేబుల్ ఎత్తుకెళ్లిన ఘటనలు అనేకం జరుగుతున్నాయి. దీంతో మెట్రో రైలు సేవలకు అంతరాయం కలగుతుంది. ముఖ్యంగా ఎలివేటెడ్ స్టేషన్ పరిధిలోనే ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఫేజ్-1కు సంబంధించిన సేవల్లో అంతరాయం ఏర్పడినప్పటికీ, మిగతా లైన్స్‌కు సంబంధించిన రైలు సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని వైశాలి-నోయిడా మధ్య బ్లూ లైన్ మెట్రో నడుస్తుంది.